కుర్రహీరోల కన్నంతా గెల్డెన్ లెగ్ హీరోయిన్ మీదే..!
తొలి చిత్రం ఏం మాయచేసేవే సినిమాతో యూత్ ని మాయచేసి తన బుట్టలో వేసుకున్న క్రేజి హీరోయిన్ సమంత ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు మంచి విజయం సాధించడంతో సమంతది గోల్డెన్ లెగ్ అని మన కుర్ర హీరోలంతా నమ్ముతున్నారు. సమంతని తము నటించే సినిమాల్లో కథానాయికగా తీసుకోమ్మని టాప్ హీరోలు నిర్మాతల మీద వత్తిడి చేస్తున్నారట.
ప్రస్తుతం సమంత చేతిలో అరడజను సినిమాలకు పైగా సినిమాలు ఉన్నాయి. అలాగే 'దూకుడు' చిత్రం తర్వాత మంచి దూకుడుమీద ఉన్న సమంత చేతిలో ఇప్పుడు రాజమౌళి ఈగ, నాగచైతన్య ఆటోనగర్ సూర్య, గౌతమ్ మీనన్ సినిమాల్లో ప్రజంట్ నటిస్తున్న ఈ చెన్నై సోయగం త్వరలో మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామ్ చరణ్ తో ఎవడు సినిమాలు చెయ్యనుంది. ఇవే కాక ఆమెకు మరిన్ని భారీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. సమంత మరో సంవత్సరం పాటు ఇదే దూకుడునే గనుక కొనసాగిస్తే టాలీవుడ్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











