twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీగణపతి ఫిలింస్‌ ద్వారా అల్లరే అల్లరి

    By Staff
    |
    స్పాట్‌న్యూస్‌ Thursday, February 17, 2005

    పోసానికృష్ణమురళి నిర్మించి దర్శకత్వంవహించిన శ్రావణమాసం సినిమాఈనెల 24న విడుదల కానుంది. ఈనెలలోసగటున రోజుకో సినిమా విడుదలవుతున్నకారణంగా పోటీని తట్టుకోడానినికినిర్మాతలు, బయ్యర్లు కొత్త మార్కెటింగ్‌ టెక్నిక్స్‌ఉపయోగిస్తున్నారు. మొదటి పది రోజులు సినిమాచూసిన వాళ్ళ టికెట్ల కౌంటర్‌ ఫాయిల్స్‌ ను పదకొండో రోజునడ్రాతీయనున్నట్టు పోసాని కృష్ణమురళిగురువారం మీడియా ప్రతినిధులకు చెప్పారు. విజేతలకు అరకేజీ బంగారంఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.

    ఈవెరైటీ సినిమాలో హీరోయిన్లు కీర్తి చావ్లా, జ్యోతికి తొమ్మిదిమంది మేనమామలుఉంటారు. ఎవరెవరో తెలుసా? బ్రహ్మానందం, మల్లిఖార్జునరావు,మల్లికార్జునరావు, అలీ, ఎల్‌బి శ్రీరాం,ఎమ్మెస్‌ నారాయణ ధర్మవరపుసుబ్రమణ్యం, సునీల్‌. వేణుమాధవ్‌,కొండవలస లక్ష్మణరావు ఆ తొమ్మిది మందిమేనమామలు. వీరి సోదరి జయలలిత.ఇంత మంది కమెడియన్ల కథలో ఎలాఅల్లుకున్నారన్నది సినిమా చేస్తేగానీతెలియదు. సినిమా రచయితగాఉన్నత స్ధాయికి చేరుకున్న పోసానికృష్ణమురళి తొలిసారిగా నిర్మాతగా మారి ఈసినిమా తీశారు. వందేమాతరం శ్రీనివాస్‌ స్వరపరిచినపాటలు బాగున్నాయి.

    ఈసినిమాలోహీరో వాల్యూ లేనందువల్ల బిజినెస్‌కావడంలో కొద్ది ఇబ్బందులు ఏర్పడ్డాయి. నిజానికి రేపు విడుదల కానున్నవెంకటేష్‌ సంక్రాంతి మినహా ఫిబ్రవరిసినిమాలన్నిటికీ బయ్యర్ల నుంచిసమస్యలు ఎదురయ్యాయి. తేజధైర్యం, బాపు రాధాగోపాళం కూడా బిజినెస్‌సమస్యలు ఎదుర్కొన్నాయి.

    హోంపేజి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X