twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’ పేరడీ అడుగుతున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇంకా 'అత్తారింటికి దారేది' విడుదల కాలేదు. ఈలోపే ఆ సినిమాలోని సన్నివేశాలను ఏ సినిమాలో పేరడీ చేయబోతున్నారని అడుగుతున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే పేరడీ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏదైనా హిట్ సినిమాల పేరడీ చేశారా? అనడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. ఇటీవల మీ సినిమాల్లో 'పేరడీ' ఎక్కువైంది. ఎందుకలా? అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా సమాధానమిచ్చారు.

    దేవిప్రసాద్ దర్శకత్వంలో నరేష్, షర్మిలా మాండ్రే జంటగా నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. 'కెవ్వు కేక' మరీ రొటీన్ అవుతుందేమో అనిపించి, ఈ సినిమాలో విజువల్ కామెడీకి ప్రాధాన్యం ఇచ్చారు. చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్‌లా ఎక్స్‌ప్రెషన్స్‌తో మేం చేసిన కామెడీకి మంచి ఆదరణ లభిస్తోంది'' అన్నారు.

    అలాగే...''నా సెల్‌ఫోన్‌లో దాదాపు మూడువేల నంబర్లు ఉంటే, అందులో ఓ ఇరవై నంబర్ల నుంచి నా సినిమా విడుదలవ్వగానే నాకు ఫోన్ వస్తుంది. ఈ ఇరవైమందీ ఉన్నది ఉన్నట్లుగా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. 'కెవ్వు కేక' విడుదలైన రోజున వీళ్లు ఫోన్ చేశారు'' అన్నారు నరేష్.

    తన సోదరుడు ఆర్యన్ రాజేష్ కుమారుడు గురించి చెప్తూ...''మా బాబు పేరు ఈవీవీ ఆరవ్ సత్యనారాయణ. మొన్నా మధ్య అన్నప్రాశన చేశాం. ఆరోజు డబ్బులు, పువ్వులు, కత్తి, ఫుడ్ ఐటమ్స్, స్క్రిప్ట్ ఫైల్, పెన్ను పెట్టాం. వాడు వెళ్లి స్క్రిప్ట్ ఫైల్, పెన్ను పట్టుకున్నాడు. మా బుల్లి ఈవీవీగారనిపించింది'' ఉద్వేగంగా అన్నారు నరేష్.

    ప్రస్తుతం రవిబాబు దర్శకత్వంలో ఓ వినూత్న పాత్ర చేస్తున్నానని, ఆ తర్వాత వరుసగా సినిమాలున్నాయని చెప్పారు. సొంత బేనర్ ఈవీవీ సినిమాపై కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ బేనర్లో ఇతర హీరోలతో సినిమాలు చేస్తామని, నిర్మాణ బాధ్యతలన్నీ రాజేష్ చూసుకుంటాడని అన్నారు.

    English summary
    Allari Naresh says that he is very happy with Kevvu Keka result. Kevvu Keka film released last friday. Kevvu Keka is a comedy film directed by Devi Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X