‘దూకుడు’, ‘ఊసరవెల్లి’ అంటూ అల్లరి నరేష్

By Srikanya

అల్లరి నరేష్‌, స్నేహాఉల్లాల్‌లు జంటగా నటించిన 'మడతకాజా" రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ 'ఇప్పటిదాకా తెలుగులో డబ్బింగ్‌ చిత్రాలే విజయవంతంగా ఆడతాయి అనే మాటను దూరంచేస్తూ ఈ దసరా పండుగకు విడుదలైన 'దూకుడు", 'ఊసరవెల్లి", 'మడతకాజా" చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ విజయాలపై ఇండస్ట్రీ ఆనందంగా ఉంది. సాధారణంగా అల్లరి నరేష్‌ నటించిన సినిమాలు అనగానే మినిమం గ్యారంటీ అనే పేరు ఉంది. ఈ చిత్రంతో ఆ బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా 'అహనా పెళ్లంట", 'సీమటపాకాయ్‌" చిత్రాల తర్వాత మళ్లీ అదే రేంజ్‌లో ఈ చిత్రం కూడా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాను సీతారామరాజు బాగా తీశారు.

వేగేశ్న, శ్రీధర్‌, రాజసింహ ఇచ్చిన మాటలు ఈ చిత్రానికి బాగా హెల్ప్‌ అయ్యాయి. గాజువాకలో సీమటపాకాయ్‌ చిత్రం రూ.8 లక్షలు వసూలుచేయగా తొలివారం మడతకాజా ఆ చిత్రం కలెక్షన్లు అధిగమించాయి. ఏలూరులో అంబికా కృష్ణగారు ఈ చిత్రం చూసి మెచ్చుకున్నారు." అన్నారు. 'దూకుడు",'ఊసరవెల్లి"చిత్రాలతో తన మడతకాజా చిత్రాన్ని పోల్చటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.ఎందుకంటే మొదటి రోజే మడతకాజా చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రాన్ని కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న దూకుడుతో కలపటంతో అల్లరి నరేష్ భలే తెలివైనవాడు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X