మహేష్ బాబు ఏ విషయం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారు: అల్లరి నరేష్
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం 'సిల్లీ ఫెల్లోస్' ప్రమోషన్లలో బిజీగా ఉన్న కామెడీ స్టార్‌కు మహేష్ బాబు గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
సెట్స్‌లో మహేష్ బాబు ఎలా ఉంటారు? అనే ప్రశ్నకు అల్లరి నరేష్ స్పందిస్తూ.... ఆయన్ను చాలా మంది ఇంట్రోవర్ట్ అనుకుంటారు, కానీ అది పూర్తిగా తప్పు. సెట్స్‌లో ఆయన అందరితో చాలా జోవియల్‌గా ఉంటారు. చాలా స్మార్ట్ పర్సన్. ముఖ్యంగా ఆయన సెన్సాఫ్ హ్యూమర్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని తెలిపారు.

మహేష్ బాబుతో కలిసి పని చేయడంకు నాకు ఒక మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. గమ్యంలో గాలిశీను మాదిరిగా... ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ సినిమాలో నేను హీరో కాక పోయినా ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని అల్లరి నరేష్ తెలిపారు.
మహర్షిలో నేను పోషించే పాత్రలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 45 రోజులు మహేష్ బాబుతో కలిసి పని చేశాను. ఇంకా 100 రోజులు పని చేయాల్సి ఉంది. మళ్లీ అక్టోబర్లో మా ఇద్దరి కాంబినేషన్లో షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. ఇంతకు మించి సినిమా గురించి నేనేమీ చెప్పలేను... మహేష్ బాబు ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటూ నరేష్ చమత్కరించాడు.


Click it and Unblock the Notifications











