ఫన్నీ గోవా ట్రిప్ (‘యాక్షన్' 3డి ప్రివ్యూ)
హైదరాబాద్: అల్లరి నరేష్ కి ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా... హాస్యాన్ని ఇష్టపడే అందరిలో అభిమానులు ఉన్నారు. దాంతో ఆయన చిత్రం రిలీజ్ అవుతోందంటే ఆ క్రేజే వేరు. తాజాగా అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు(జూన్ 21) న సినిమా విడుదల అవుతోంది.
కథేమిటంటే... బావ, శివ, పురుష్, అజయ్ ఈ నలుగురూ స్నేహి తులు.చిన్ననాటి నుంచీ వీరి మధ్య అనుబంధం ఉంది. అంతా కలిసి హైదరాబాద్ నుంచి గోవాకి రోడ్డుమార్గంలో బయల్దేరతారు. ఆ ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? గోవా వెళ్లాక ఏం జరిగింది? అనే విషయాలు ఆసక్తికరం.
దర్శకుడు మాట్లాడుతూ ''మన దేశంలో తెరకెక్కిన తొలి త్రీడీ కామెడీ చిత్రమిది. నలుగురు స్నేహితుల మధ్య ఆద్యంతం సరదాగా సాగుతుంది. పులి, చింపాంజీ కూడా కథలో కీలక పాత్ర పోషిస్తాయి. సుదీప్ పాత్ర అందరినీ ఆకట్టుకొంటుంది. సునీల్ ఒబామాగా వినోదం పంచుతారు. 'స్వాతి ముత్యపు జల్లులలో...' పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.
సంస్థ: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి.
నటీనటులు: అల్లరి నరేష్, వైభవ్, కిక్ శ్యామ్, రాజు సుందరం, నీలమ్ ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్, సునీల్, సుదీప్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు
కెమెరా : సర్వేష్ మురారి,
3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్,
సంగీతం: బప్పా-బప్పీలహరి,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర,
మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల,
పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్,
సహనిర్మాత: కిషోర్ గరికిపాటి,
నిర్మాత: సుంకర రామబ్రహ్మం,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.
విడుదల: 21,జూన్ 2013


Click it and Unblock the Notifications











