twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీ-తెలుగు ఛానల్లో అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకు సిద్దమైన ఈచిత్రం శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయి.

    జీ తెలుగు సంస్థ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ దాదాపు రూ. 3.5 కోట్లు చెల్లించిసొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సో...బుల్లితెర ప్రేక్షకులు త్వరలోనే జీ తెలుగు ఛానల్‌లో ఈ చిత్రాన్ని చూడబోతున్నారన్నమాట. అల్లరి నరేష్ కెరీర్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. అదే విధంగా 3డి టెక్నాలజీ ఉపయోగించి రూపొందిస్తున్న తొలి కామెడీ సినిమా కూడా ఇదే.

    వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ఇతర ముఖ్య పాత్రదారులు. రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రం పూర్తి వినోదాత్మక చిత్రం.

    ఈ చిత్రానికి కెమెరా : సర్వేష్ మురారి, 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

    English summary
    Allari naresh’s latest and most awaited movie Action 3D satellite rights picked up by Zee Telugu for a very good price of approximately 3.5 Crores. The film has completed it’s censor formalities and releasing on June 21th. The movie will release in both 2D and 3D versions across the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X