మరోసారి ‘సీమశాస్ర్తి’ కాంబినేషన్ రిపీట్
అల్లరి నరేష్, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో గతంలో 'సీమశాస్ర్తి" అనే కామిడీ చిత్రం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో మరో చిత్రం ప్రారంభం కానుంది. గతంలో సిద్దు ప్రమ్ సికాకుళం చిత్రం నిర్మించిన మళ్ళ విజయప్రసాద్ ఈ చిత్రాన్ని వేల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రం అక్టోబర్ ఎనిమిది నుంచి మలేషియాలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్...తన తండ్రి ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నటిస్తున్న 'కత్తి కాంతారావు" చిత్రం పూర్తవగా, ఏకె ఎంటర్‌టైనర్స్ పతాకంపై వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అహనా పెళ్ళంట అనే చిత్రం చేస్తున్నారు. నమో వెంకటేశ,బిందాస్ చిత్రాలు నిర్మించిన అనిల్ సుంకర ఈ కామిడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లరి నరేష్ సీమశాస్త్రి కత్తి కాంతారావు బిందాస్ నమో వెంకటేశ అహనా పెళ్ళంట allari naresh seema sastry katti kanta rao bindaas namo venkatesa


Click it and Unblock the Notifications