Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కామ్మా జఠ్మలాని ని మళ్ళీ మడతెట్టేసిన అల్లరి నరేష్
అల్లరి నరేష్ ప్రస్తుతం కత్తుల కాంతారావు అనే చిత్రాన్ని తన తండ్రి ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ 'ఎవర్నయినా మడతెట్టేస్తాడు'అని.ఫన్నీగా ఉండేలా పెట్టినా ఈ ట్యాగ్ లైన్ నిజ జీవితంలో అల్లరి నరేష్ క్యారెక్టర్ కి సరిపోతుందంటున్నారు. బెండు అప్పారావులో తన సరసన చేసిన కామ్నా జట్మలానిని మళ్ళీ తీసుకునేలా తన తండ్రిని ఒప్పించిన మడితెట్టేసే కళ గొప్పదే అంటున్నారు. నరేష్ తో ఒక్కసారి చేసిన హీరోయిన్ తో అతను అల్లరి చేసి ఆ తర్వాత ఆమెను తన సినిమాలో లిప్ట్ ఇవ్వటం కామన్ అంటున్నారు. మొన్న ఫర్జానా,నిన్న మంజరి,ఈ రోజు కామ్నా జఠ్మలాని అని చెప్తున్నారు. అందులోనూ నరేష్ చేసేవి చిన్న సినిమాలే అయినా వరసగా ఆఫర్స్ ఉండటంతో అతన్ని మంచి చేసుకోవటానికి హీరోయిన్స్ ముందుంటారు. ఇక ఈ కత్తుల కాంతారావు చిత్రంలో అల్లరి నరేష్..కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నాడు.
ఈ చిత్రం గురించి ఈవీవీ మాట్లాడుతూ "కాంతారావు ఏ సమస్య అయినా నవ్వులతోనే ఎదుర్కొంటాడు. అతని ఆయుధం అదే. కుటుంబ భారాన్ని మోస్తూ, తన బాధ్యతల్ని తెలివిగా ఎలా నెరవేర్చాడో చూపిస్తున్నాం. అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు తరహాలో వినోదాన్ని పంచిపెట్టే చిత్రమిది. ఆగస్టు 1 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో కొంత భాగం చిత్రీకరిస్తాం. దాంతో టాకీ పూర్తవుతుంద"న్నారు. కోట శ్రీనివాసరావు, అలీ, వేణుమాధవ్, చలపతిరావు, రఘబాబు, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, ధర్మవరపు, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, జీవా తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మల్లికార్జున్.