శ్రీహరి, బ్రహ్మానందం తర్వాతే నేనంటున్న హీరో
"ఈ సినిమాకు ముగ్గురు హీరోలు. శ్రీహరి, బ్రహ్మానందం, ఆ తర్వాత నేను అంటున్నాడు అల్లరి నరేష్. అతని చిత్రం 'అహ నా పెళ్లంట!' వంద రోజుల వేడుక మంగళవారం రాత్రి రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ నరేష్ ఇలా స్పందించాడు. అలాగే ఇప్పటివరకు 39 సినిమాలు చేశా. ఇది మా నాన్నకి అంకితమిచ్చిన సినిమా. కథ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం. డిసెంబర్‌లో ఈ నిర్మాతతో మరో సినిమా చేయబోతున్నా అని చెప్పారు. శ్రీహరి కీలక పాత్రధారిగా నటించిన ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు.
వీరభద్రమ్ మాట్లాడుతూ.. "ఇది నా జీవితంలో మరచిపోలేని రోజు. నేను సినీ పరిశ్రమకు రావడానికి కారకులు ఇ.వి.వి. గారు. నిర్మాతకు ఓ రూపాయి లాభం చేకూర్చమని ఆయన నాకు చెప్పారు. అదే పాటించా. నన్ను నమ్మి అవకాశమిచ్చిన నరేశ్‌కు రుణపడి ఉంటా'' అన్నారు.నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ " ఇ.వి.వి. గారి ఆశీర్వాదం కూడా ఉండటంతో వంద రోజులు ఆడింది. నరేశ్‌తో సినిమా తీయడం చాలా తేలిగ్గా ఉంటుంది. అతనితో మరో బ్లాక్‌బస్టర్ తీయబోతున్నాం'' అన్నారు.


Click it and Unblock the Notifications











