ఆ సినిమా ఓపెనింగ్స్ కంటే టాక్ బాగున్నఈ సినిమానే అంతిమ విజేత...!
క్రికెట్ ఫీవర్ వేడెక్కుతోందని తెలిసినా కానీ సమ్మర్ లో పెద్ద సినిమాల సెగ తగలకుండా బతికి బట్ట కట్టడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని డిసైడయి మహాశివరాత్రి కానుకగా ఛార్మి, అల్లరి నరేష్ ల సినిమాలు రిలీజ్ చేశారు. అవుటాఫ్ ఫామ్ లో ఉన్నా కానీ 'ఐస్ ఐస్"అంటూ ఆకట్టుకున్న ఛార్మి 'మంగళ"కి మంగళకరమై ఓపెనింగ్స్ రాబట్టింది. భారీ లెవల్లో రిలీజ్ చేసిన ఈ చిత్రానికి దాదాపుగా అన్ని ఏరియాల్లో చెప్పుకోతగ్గ ఆరంభ వసూళ్లు వచ్చాయి. దీంతో పాటే విడుదలైన 'అహ నా పెళ్లంట" ఓపెనింగ్స్ కాస్త వీక్ గానే ఉన్నాయి. అల్లరి నరేష్ సినిమాలు మరీ రెండు నెలలకొకటి చొప్పున వచ్చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు అతని సినిమాలకి తొలి రోజే క్యూ కట్టే పరిస్థితి లేదిప్పుడు.
మంగళకి ఓపెనింగ్స్ బాగా వచ్చినా కానీ 'ఆహ నా పెళ్లంట" చిత్రానికి టాక్ బాగుంది రెండిటిలో ఏది బెటరని అడిగితే 'అహ నా పెళ్లంట"కే ఓటేస్తున్నారు. రొటీన్ కామెడీనే అయినా కనీసం ఈ సినిమాలో టైమ్ పాస్ అవుతోందని, మంగళ సెకంఢాఫ్ మరీ బ్యాడ్ గా ఉండడంతో బోర్ కొట్టిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఓపెనింగ్స్ కంటే టాక్ బాగున్న సినిమానే అంతిమ విజేత అవుతుంది కాబట్టి కాస్త ఆలస్యమైనా మంగళ మీద అహనాపెళ్లంటదే పై చేయి అవుతుందనుకోవచ్చు.


Click it and Unblock the Notifications











