»   » అల్లరి నరేష్-విరూప ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

అల్లరి నరేష్-విరూప ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో, యంగ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఎగేజ్మెంట్ మే 1న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేసారు. అనంతరం అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ తన సోదరుడి వివాహ విషయాలను వెల్లడిస్తూ ప్రకకటన విడుదల చేసారు.

Allari Naresh and Virupa Engagement photos

‘మా తమ్ముడు ఈదర నరేష్, ఈదర వీర వెంకట సత్యనారాయణ(లేట్), సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రుడు, రామకృష్ణ కంఠమనేని, రమ దంపతుల పుత్రిక విరూప కంఠమనేనిల నిశ్చితార్థ వేడుక ఈ రోజు(మే 1న) చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది. వీరివురి వివాహాన్ని జరపడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించినారు. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగును. బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశ్వీర్వదించాలని ప్రార్థన' అంటూ రాజేష్ మీడియా ప్రకటన విడుదల చేసారు.

Allari Naresh and Virupa Engagement photos

విరూపకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా పని చేస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్. అల్లరి నరేష్ కు తగిన జోడీ కోసం గత కొన్ని నెలలుగా కుటుంబ సభ్యులు అన్వేషణ సాగిస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన విషయాలేవీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. నిశ్చిర్థం ఫిక్సయ్యే వరకు అంతా గోప్యత పాటించారు. ఎట్టకేలు ఈ విషయం బయటకు రావడంతో నరేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Check out Allari Naresh and Virupa Engagement photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu