అల్లరి నరేష్ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో బెండు అప్పారావు ఆర్.ఎం.పి అనే చిత్రం రూపొందుతోంది. మొన్న ఉగాది రోజున ప్రారంభమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి కామిడీగా ఉంటుందని సమాచారం. ఇక మహిళా దర్శకరాలు బి.జయ చేయాలనుకున్న సినిమా ఇదే నని కొన్ని పరిస్ధితుల్లో డైరక్టర్ ని మార్చారని, స్క్రిప్టు అదేనని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక జనార్ధన మహర్షి శిష్యుడు గిరి అందించిన కథకు వెలగొండ సంభాషణలు సమకూరుస్తున్నారు. ఫిటింగ్ మాస్టర్ అనంతరం ఇ.వి.వి. తిరిగి తన స్కూల్ లోకి వెళ్ళి ఈ చిత్రాన్ని కసిగా రూపొందిస్తున్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ నరేష్ అండ్ టీమ్.