'గబ్బర్ సింగ్'గా అల్లరి నరేష్ గెటప్ ఇదే
పవన్ స్టార్ గన్ను పడితే గబ్బర్ సింగ్...సడెన్ స్టార్ కన్ను కొడితే కామెడీ స్వింగ్ అనే కాప్షన్ తో అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడు కొత్త పోస్టర్ విడుదల అయ్యింది. ఈపోస్టర్ లో అల్లరి నరేష్ ..గబ్బర్ సింగ్ గెటప్ లో ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం అలరిస్తుందని నమ్ముతున్నారు. అలాగే గబ్బర్ సింగ్ లోని డైలాగు ని సైతం ప్యారెడీ చేసారు. ఫన్నీగా ఉండే ఈ పోస్టర్స్ అందరినీ అలరిస్తున్నాయి.
విరివిగా సినిమాలు చేస్తూ, వరుసగా విజయాలు సాధిస్తూ పరిశ్ర మలో దూసుకుపోతున్న అల్లరి నరేష్‌కు 'సుడిగాడు' అనే టైటిల్ నిజంగా యాప్ట్. ఇది పరిశ్రమలో పలువురి అభిప్రాయం కూడా. అదృష్టవంతుడుకి పర్యాయపదం 'సుడిగాడు'. ఈ సినిమాను నిర్మాత. తమ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని, ఇప్పటికే షూటింగ్ పూర్తయిందనీ, ఈనెల 23న ఆడియోను విడుదలచేయనున్నామనీ, ఆగస్టులో సినిమాను విడుదలచేయనున్నామనీ దర్శకుడు పేర్కొన్నారు. అలాగే మా చిత్రంలో ఒక కొటేషన్ ఉంది. 'ఇకపై ఎవరు లంచం ఇచ్చినా, తీసుకున్నా.. డాష్..డాష్.. చూపించి చంపేస్తా...' అనేది. అది ఏమిటనేది అల్లరి నరేస్ చేస్తే విన్యాసాలతో హాయిగా నవ్వుకోవచ్చు' అని దర్శకుడు అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ... "ఈ చిత్రంలలో 2000 నుంచి ఇప్పటి వరకూ వచ్చిన విజయవంతమైన సినిమాల్లోని సన్నివేశాలకు పేరడీలు చేశాం. ఇన్నాళ్లూ ఒకట్రెండు సన్నివేశాల్లోనే పేరడీ చేసేవాణ్ని. 'సుడిగాడు' నిండా అలాంటి సరదాలే ఉంటాయి. అలాగని ఎవరినీ కించపరచలేదు" అన్నారు. "అలాగే 'సుడిగాడు'చిత్రం లో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాను. తండ్రీకొడుకులుగా కనిపిస్తా. ఎప్పట్లాగే నవ్విస్తాను" అని అల్లరి నరేష్ చెప్పారు. తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు. 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా చేస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ''అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటు"న్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్.


Click it and Unblock the Notifications











