హాట్ టాపిక్ :కొవ్వు పట్టిన అల్లరి నరేష్
ఇందుకోసం లండన్ నుంచి నిపుణులను రప్పించి మేకప్ చేయిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్ పాత్ర కొత్త తరహాలో వినోదాన్ని పంచేలా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన మేకప్ కోసం లండన్‌లోని నిపుణులను సంప్రదించారు. వారి సూచనలకు అనుగుణంగా నరేష్‌కి మేకప్ చేస్తున్నారు.
సుమారు మూడు గంటలపాటు మేకప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ విషయంలో హీరో, దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సెట్‌కి యూనిట్ మినహా మరెవరూ రాకుండా చూసుకొంటున్నారు.
అల్లరి నరేష్ -రవిబాబు కాంబినేషన్‌లో 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ సారి నరేష్‌ని డబుల్ రోల్‌లో చూపించడానికి రవిబాబు కసరత్తులు చేస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications












