Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మళ్లీ అల్లరోడనిపించుకున్నాడు.. ఆకట్టుకుంటోన్న బంగారు బుల్లోడు టీజర్
అల్లరి నరేష్.. ఈ పేరు ఒకానొక సమయంలో విపరీతంగా మార్మోగిపోయింది. ఏడాదికి ఏడెనెమిది సినిమాలు వరుసగా గ్యాప్ లేకుండా తీసేవాడు. అవన్నీ మినిమమ్ గ్యారెంటీ చిత్రాలే. అయితే కొంతకాలానికి అల్లరి నరేష్ అల్లరి తక్కువ అయింది. దీంతో కొన్నేళ్లు సరైన సినిమాలేవీ పడలేదు. అయితే మహర్షి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఆ చిత్రంతో అల్లరి నరేష్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. నేడు అల్లరోడి బర్త్ డే సందర్భంగా తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్స్‌ను ఇచ్చాడు.
అందులో ఒకటి నాంది టీజర్. అల్లరి నరేష్‌లో ఉన్న మరో కోణాన్ని బయట పెట్టేలా తెరకెక్కిస్తున్న నాంది ఇప్పటికే పోస్టర్లతోనే హైప్ క్రియేట్ చేసింది. తాజాగా టీజర్‌తో బ్లాక్ బస్టర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికీ యూట్యూబ్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అయితే అల్లరి నరేష్ అందరూ ఆశించే హాస్యాన్ని కూడా పరిచయం చేశాడు. అందుకోసం బంగారు బుల్లోడు టీజర్‌తో కామెడీని ఆస్వాధించే ప్రేక్షకులనూ రంజింపజేశాడు.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. బ్యాంక్ లాకర్లో కస్టమర్లు దాచిన బంగారాన్ని సొంతానికి వాడుకోవడం, వాటి నుంచి వచ్చే కామెడీ, అల్లరి నరేష్ మునుపటి కామెడీ టైమింగ్ అన్ని ఆకట్టుకున్నాయి. ఇక ఓ వైపు నాంది టీజర్ అదరగొడుతుండగా.. మరోవైపు బంగారు బుల్లోడు దుమ్ములేపుతోంది. పూజా జవేరి ఈ సినిమాలో హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.గిరి దర్శకత్వం వహిస్తున్నాడు.