Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లరి నరేష్ నాకు గురువు...ముంబై భామ నిధి
ఒక విధంగా చెప్పాలంటే నరేష్ నాకు గురువు. ఆయన అందించిన సహకారంతోనే నేను చిత్రం పూర్తి చేసాను అంటోంది ముంబై ముద్దుగుమ్మ నిధి. ఆమె ఉషాకిరణ్ మూవీస్ నిర్మిస్తున్న'బెట్టింగ్ బంగార్రాజు' హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రం ఈనెల 9న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పై విధంగా చెప్పుకొచ్చింది. డైలాగుని, అందులోని భావాన్ని అర్థం చేసుకొని ముఖంలో పలికించడం...చాలా కష్టం. అయితే కష్టపడింది నేను కాదు. నా హీరో అల్లరి నరేష్. ప్రతి డైలాగునీ ఆయనే నాకు అర్థం అయ్యేలా చెప్పేవారు అంటూ మురిసిపోతూ చెప్పుంది.
ఇక 'బెట్టింగ్ బంగార్రాజు' తన పాత్ర గురించి చెబుతూ..నా పేరు దివ్య. పల్లెటూరి అమ్మాయినే. కానీ ఆధునిక భావాలు ఉంటాయి. చీమకు అపకారం జరుగుతుందన్నా తల్లడిల్లిపోయే మనసు. మరో పక్క బంగార్రాజు శవాల మీద కూడా పందెం కాసే రకం. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది నేను చెబితే బావుండదు. తెర మీదే చూడాలి అంది. అలాగే నరేష్ కామెడీ టైమింగ్ చూస్తే చాలా ముచ్చటేసేది. 'బెట్టింగ్ బంగార్రాజు'లో దాదాపు అన్ని సన్నివేశాలూ నవ్వించేవే. కాబట్టి నరేష్ ఇంకా బాగా అల్లుకుపోయేవారు. ఆయనతో సన్నివేశం అనేసరికి చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది అంటూ చెప్పుకొచ్చింది. ఇక నిధి ఇంతకు ముందు హిందీలో రాకెట్ సింగ్ అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది.