»   » అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు, పండంటి అమ్మాయి (ఫోటో)

అల్లరి నరేష్ తండ్రి అయ్యాడు, పండంటి అమ్మాయి (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. గతేడాది విరూపతో వివాహం తర్వాత భర్తగా ప్రమోషన్ పొందిన నరేష్ ఈరోజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు. బుధవారం విరూపం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నరేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులో షేర్ చేసుకున్నాడు.

అల్లరి ట్వీట్

అల్లరి నరేష్ తండ్రి అయిన సందర్భం గా హీరో నాని చేసిన ట్వీట్

గతేడాది వివాహం

గతేడాది వివాహం

అల్లరి నరేష్ వివాహం విరూపతో గతేడాది ఘనంగా జరిగింది. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగింది. పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

విరూప

విరూప

విరూపకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా కూడా కొంతకాలం పని చేసింది. వీరిది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్.

ఎంగేజ్మెంట్ నాటి ఫోటో

ఎంగేజ్మెంట్ నాటి ఫోటో

ఎంగేజ్మెంట్ మే 1, 2015 న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. నిశ్చిర్థం ఫిక్సయ్యే వరకు అంతా గోప్యత పాటించారు. నిశ్చితార్థం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే వివాహ వేడుక పూర్తయింది.

English summary
"Officially the happiest and luckiest man alive by becoming a father to the most beautiful baby girl," informed Naresh, whereas his best buddie and hero Nani posted picture of Naresh holding his daughter on hands.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu