Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కామిడీ హీరో అల్లరి నరేష్ గురించి నమ్మలేని నిజం
అల్లరి నరేష్ చూస్తూండగానే పెద్ద కామిడీ హీరో అయిపోయారు. అతని డేట్స్ 2013 దాకా ఖాళీ లేవనే నిజం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. మినిమం గ్యారెంటీగా ముద్రపడ్డ నరేష్ చేతిలో ప్రస్తుతం తొమ్మిది చిత్రాలు ఉన్నాయి. అతను సంవత్సరానికి ఏడు సినిమాలు ప్లాన్ చేసుకుని అందులో మినిమం ఐదు చిత్రాలైనా హిట్టై సేఫ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఎనభైల్లో సీనియర్ హీరోలైన కృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి వరస సినిమాలు ఒప్పుకుని చేసిన్నట్లే నరేష్ వరస సినిమాలు కమిట్ అవుతున్నాడు. భారీ బడ్జెట్ లేకపోవటం, ఫ్లాఫ్ అయినా పెద్దగా నష్టపోయేదేమీ లేకపోవటం చాలా మంది నిర్మాతలను అతనివైపుగా అడుగులు వేసేలా చేస్తోంది. ఇక నరేష్ దానికి తగ్గట్లుగానే అరవై నుంచి ఎనభై లక్షలు వరకూ ఇన్నాళ్ళూ డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే తనకు పెరిగిన క్రేజ్, డిమాండ్ చూసుకుని కోటి నుంచి కోటి పాతిక దాకా అడుగుతున్నారు. ఇక శాటిలైట్ మార్కెట్ లో అతని సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అతను తీసుకునే రెమ్యునేషన్ వెనక్కి శాటిలైట్ హక్కుల రూపంలో వస్తుంది. ప్రస్తుతం కె.విశ్వనాధ్ దర్శకత్వంలో చేసిన శుభప్రదం చిత్రం రిలీజుకు రెడీగా ఉంది. అలాగే వంశీ దర్శకత్వంలో ప్రస్తుతం సరదాగా కాసేపు చిత్రం రూపొందుతోంది. వీటితో పాటు తన తండ్రి ఇవివి దర్శకత్వంలో సిల్లీ ఫెలో అనే చిత్రంలో చేస్తున్నారు.