తన సినిమా వల్ల హీరోలు ఫీలవ్వడంపై... అల్లరి నరేష్
హైదరాబాద్: టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. వందకు పైగా చిత్రాలను స్పూఫ్ చేస్తూ రూపొందించిన ఈచిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోలందరిపై పేరడీ చేసారు. ఈ సందర్బంగా మీడియా వారు ఆయన్ను...మీరు టాప్ హీలపై పేరడీ చేసారు. వాళ్లు హర్టయితే ఎలా? అని ప్రశ్నించగా.... 'తన సినిమా వల్ల హీరోలు ఎవరూ ఫీల్ కారని, కేవలం నవ్విండానికి మాత్రమే ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. చిత్రం ఏ హీరోనూ కించపరిచేదిగా ఉండదని, ఆ ఉద్దేశ్యం కూడా తమకు లేదని, కేవలం నవ్వులు పండించే విధంగా ఉంటుందన్నారు. తన తర్వాతి ప్రాజెక్టుల గురించి నరేష్ వెల్లడిస్తూ...ప్రస్తుతం యముడికి మొగుడు చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు. చార్లీ చాప్లిన్ లాంటి స్టోరీల్లో నటించాలని ఉందన్నారు.'
ఈ చిత్రంలో నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా చేస్తోంది. . ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రానికి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.
పవన్ కళ్యాణ్, వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా అల్లరి నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు. చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్, సంస్థ : అరుంధతి మూవీస్, నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











