ఎన్టీఆర్ రికార్డ్ ని క్రాస్ చేసేస్తానంటున్న అల్లరి హీరో....
సీనియర్ ఎన్టీఆర్ రికార్డును అల్లరి నరేష్ క్రాస్ చేస్తాడంటే వినడానికి కాస్తంత ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. సీనియర్ ఎన్టీఆర్ 300పై చిలుకు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాతి తరం మీరోలు 100, 150 సినిమాలు పూర్తి చేయడమే కష్టతరం అయిపోయింది. ఇక ఇప్పటి హీరోలు కనీసం 50సినిమాలు అయినా పూర్తి చేస్తారా? అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది. కానీ ఒక్క అల్లరి నరేష్ విషయంలో మాత్రం ఇది జరిగి తీరుతుందని పరిశీలకులు అంటున్నారు. యేడాదికి 4సినిమాలు ఈ హీరోగారు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ యావరేజ్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ కెరీయర్ లాంగ్విటీ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అల్లరి నరేష్ మూడు వందల సినిమాలకు పై చిలుకు చేస్తాడని పరిశీలకులు అంటున్నారు.
అల్లరి నరేష్ ఎన్టీఆర్ కత్తి కాంతారావు సరదాగా కాసేపు allari naresh jr ntr katti kantharao saradaga kasepu


Click it and Unblock the Notifications