»   » అల్లరి నరేష్ కూతురు ఫోటో తొలిసారి అభిమానుల కోసం (ఫోటోస్)

అల్లరి నరేష్ కూతురు ఫోటో తొలిసారి అభిమానుల కోసం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, విరూప దంపతులు సెప్టెంబర్లో తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అల్లరి నరేష్ కూతురుకు సంబంధించిన ఫోటోలేవీ బయటకు రాలేదు. అయితే అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫోటో చూపించాలని కోరడంతో... ఎట్టకేలకు కూతురుతో కలిసి దిగిన ఫోటోను అల్లరి నరేష్ అభిమానులతో షేర్ చేసుకున్నారు.

అంతే కాదు తన కూతురు పేరు కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అయాన ఇవిక అనే పేరును పెట్టినట్లు తెలిపారు. ఈదర అనేది అల్లరి నరేష్ ఇంటిపేరు అనే విషయం అందరికీ తెలిసిందే.

కూతురు ఫోటో ట్వీట్

ప్రజెంటింగ్ అయానా ఇవిక ఈదర, అవర్ లైఫ్.... అంటూ అల్లరి నరేష్ ట్వీట్ చేసారు. అయానా ఇవికా ఎంతో క్యూట్ గా ఉందని, ముద్దొస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం థియేట్రికల్ ట్రైలర్

అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం తెలుగు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఎక్స్ క్లూజివ్ గా ఎస్ వి సి సి ఛానెల్లో మాత్రమే రిలీజ్ చేసారు. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో అల్లరి నరేష్, కృతిక, మౌర్యాని, రాజేంద్ర ప్రసాద్, పోసాని మురళి కృష్ణ, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ మరియు చలపతి రావు నటించారు. G నాగేశ్వర రావు దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ గారు నిర్మించారు

గతేడాది వివాహం

గతేడాది వివాహం

అల్లరి నరేష్ వివాహం విరూపతో గతేడాది ఘనంగా జరిగింది. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగింది. పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

విరూప

విరూప

విరూపకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా కూడా కొంతకాలం పని చేసింది. వీరిది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్.

ఎంగేజ్మెంట్ నాటి ఫోటో

ఎంగేజ్మెంట్ నాటి ఫోటో

ఎంగేజ్మెంట్ మే 1, 2015 న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. నిశ్చిర్థం ఫిక్సయ్యే వరకు అంతా గోప్యత పాటించారు. నిశ్చితార్థం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే వివాహ వేడుక పూర్తయింది.

English summary
Allari Naresh and his wife Virupa were blessed with a Baby girl a few days back in September. Now, Allari Naresh shared a pic of his Daughter along with his wife. He tweeted "Presenting Ayana Evika Edara, our life:)"sharing along with the pic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu