»   » హీరో అల్లరి నరేష్ కూతురు బారసాల వేడుక... (ఫోటోస్)

హీరో అల్లరి నరేష్ కూతురు బారసాల వేడుక... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్, విరూప దంపతుల గారాల కూతురు..... అయానా అవిక ఈదర బారసాల వేడుక ఇటీవల జరిగింది. ఈ మధ్యే తమ కూతురు అయానా ఫోటో పోస్టు చేయడం ద్వారా ఆమెను అభిమానులకు పరిచయం చేసిన అల్లరి నరేష్.... అయానా అవిక బారసాల వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి నరేష్ కు చాలా క్లోజ్ గా ఉండే నాని దంపతులు హాజరయ్యారు. అల్లరి నరేష్, విరూపని గతేడాది మేలో వివాహం చేసుకోగా ఈ ఇద్దరికి సెప్టెంబర్ లో పండంటి పాప జన్మించింది. తాజాగా ఆ పాపకి అయానా అవిక ఈదర అనే పేరు పెట్టారు.

బారసాల వేడుక

బారసాల వేడుక

అయానా అవిక బారసాల వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.

చాలా క్లోజ్

చాలా క్లోజ్

అల్లరి నరేష్ దంపతులు, నాని దంపతులు చాలా క్లోజ్.... ఈ కార్యక్రమానికి నాని తన భార్యతో కలిసి హాజరై ఆ చిన్నారిని దీవించారు.

భార్య, కూతురు

భార్య, కూతురు

అల్లరి నరేష్ వివాహం విరూపతో గతేడాది ఘనంగా జరిగింది. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగింది. పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

ప్రపంచానికి పరిచయం చేస్తూ...

ప్రపంచానికి పరిచయం చేస్తూ...

అయానా అవిక ఈదరను అభిమానులకు పరిచయం చేస్తూ ఇటీవలే నరేష్ తన ట్విట్టర్లో ఈ ఫోటో పోస్టు చేసారు.

English summary
Check out Allari Naresh daughter Cradle ceremony Photos.Well We all know that Allari naresh & Virupa are blessed with baby girl and recently naresh has shared the picture of his cute daughter picture on twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu