అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం...డిటేల్స్

By Srikanya

Allari Naresh
హైదరాబాద్: నరేష్‌ హీరోగా 'జంప్‌ జిలానీ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్‌ది ద్విపాత్రాభినయం. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి అంబికా కృష్ణ నిర్మాత. తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు' రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా విశాఖ సింగ్‌ని ఎంపిక చేసినట్లు తెలిసింది. మరో హీరోయిన్ కీ స్థానం ఉంది.

ఇక 'కలగలప్పు' చిత్రం ఇద్దరు స్నేహితులు తమ వారసత్వంగా వచ్చిన రెస్టారెంట్ ని ఓ రియల్ ఎస్టేట్ డవలపర్ నుంచి కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలతో రూపొందింది. ఈ చిత్రం సోల్ కిచెన్ అనే జర్మినీ చిత్రం ఆధారంగా రూపొంది తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది.

ప్రస్తుతం అల్లరి నరేష్ ... బ్లేడ్ బాబ్జీ ఫేమ్ దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న 'కెవ్వు కేక' లో కనిపించి నవ్వించనున్నారు. షర్మిల మాంద్రే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అల్లరి నరేష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. కెవ్వుకేక చిత్రంతో పాటు, యాక్షన్ 3డి చిత్రాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈరెండు చిత్రాలకు సంబంధించిన పనులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత అల్లరి నరేష్-వరలక్ష్మి కాంబినేషన్లో సాయి కిషోర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X