అల్లరి నరేష్ నిశ్చితార్థం సెట్టయింది
హైదరాబాద్: టాలీవుడ్లోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిర్లలో ఒకరిగా ఉన్న కామెడీ స్టార్, యువ హీరో అల్లరి నరేష్ పెళ్లి ఎట్టకేలకు సెటిలయింది. చెన్నైలో సెటిలైన కృష్ణా జిల్లాకు చెందిన విరూప అనే అమ్మాయితో అతని పెళ్లి జరుగబోతోంది. ఈ రోజు(శుక్రవారం) సాయంత్నరం నశ్చితార్థం ఫిక్సయినట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ప్రథమార్థంలోనే అల్లరోడి పెళ్లి భాజా మ్రోగే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో బాక్సాఫీసును తన కామెడీ పంచ్ లతో హోరెత్తించిన అల్లరి నరేష్ జోరు ప్రస్తుతం కాస్త తగ్గింది. త్వరలో అల్లరి నరేష్ ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సినిమా టైటిల్ కూడా ఇంకా ఖరారు కాలేదు. అల్లరి నరేష్ కెరీర్లో ఇది 49వ సినిమా. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. కెరీర్లో 50 సినిమాలు పూర్తయిన తర్వాతే అల్లరి నరేష్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎలాగైనా ఈ సంవత్సరమే 50వ సినిమా పూర్తి చేసి పెళ్లి పీటలెక్కబోతున్నాడు అల్లరి నరేష్.
పార్టీలు పబ్బులూ అంటూ తిరిగే మోడ్రన్ అమ్మాయి అవసరం లేదని, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా చక్కబెట్టే సాంప్రదాయ బద్దమైన అమ్మాయి కావాలని అల్లరి నరేష్ కోరుకుంటున్నాడు. ఇపుడు అలాంటి అమ్మాయే దొరకడంతో అల్లరి నరేష్ చాలా హ్యాపీగా ఉన్నాడట.


Click it and Unblock the Notifications











