సునీల్ చూపులతో.. నరేష్‌కు మనశ్శాంతి కరువు
రాజేంద్రప్రసాద్ శకం ముగిసిన తర్వాత...ఆయన స్థాయిలో కామెడీ హీరోగా ఎదిగి ప్రస్తుతం టాలీవుడ్ లో ఏకచత్రధిపత్యం వహిస్తున్న హీరో అల్లరి నరేష్. కామెడీ నేపథ్యం ఉన్న హీరోలు మరెవరూ లేక పోవడంతో అత్యధిక సినిమాలతో నరేష్ కెరీర్ ఇంతకాలం బీజీ బీజీగా సాగింది. ఏ నిర్మాత అయినా తక్కువ బడ్జెట్లో మంచి కామెడీ సినిమా తీయాలన్నా....నరేష్ తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండేది కాదు. అయితే ఇప్పడు నరేష్ కు కొత్త భయం పట్టుకుంది. తనకు పోటీగా సునీల్ రంగంలోకి దిగడమే ఇందుకు కారణం.
ఇన్నాళ్లు పెద్ద హీరోల సినిమాల్లో కామెడీ వేషాలు వేసుకుంటూ మంచి పేరు సంపాదించిన సునీల్...మర్యాద రామన్నతో హీరోగా సక్సెస్ అయ్యాడు. ఈ వూపుతో కామెడీ వేషాలకు గుడ్ బై చెప్పిన సునీల్..తన చూపంతా హీరో పాత్రలపైనే ఉంచాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో కామెడీ హీరోల కవురు బాగా ఉండటం సుఃనీల్ కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం "పూలరంగడు" సినిమా చేస్తున్న సునీల్...ఆ సినిమా సక్సెస్ అయితే నరేష్ ను బీట్ చేయడం ఖాయం అంటున్నారు సీని విశ్లేషకులు.
ఈ పరిణామాల నేపథ్యంలో...సునీల్ చూపులు, తన కెరీర్ కు అంత మంచిది కాదనే ఆందోళనతో నరేష్‌కు మనశ్వాంతే కరవవుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల గుసగుస.


Click it and Unblock the Notifications











