అల్లరోడి సినిమా వచ్చేది అప్పుడే, ఈసారి హిట్ గ్యారెంటి అంటున్నారు!
అల్లరి నరేష్ బీమినేని శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన "సుడిగాడు" చిత్రం అల్లరి నరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. చాలా గ్యాప్ తరువాత వీరిద్దరుకలిసి సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ అల్లరి నరేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నాడు. రంగులరాట్నం సినిమా హీరోయిన్ చిత్ర శుక్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగులో ఉన్న ప్రముఖ కమీడియన్స్ అందరు ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మేలో విడుదల కానుంది. హిట్ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించి చిత్ర యూనిట్ కు పేరు రావాలని కోరుకుందాం.

ఇద్దరు టాప్ కామెడీ స్టార్‌లు నటిస్తుండటంతో సినిమాలో వినోదానికి డోకా లేదని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా సినిమాకు సిల్లీ ఫెలోస్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ టైటిల్ బాగుందని చిత్ర యూనిట్ ఇదే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











