'అహ నాపెళ్లంట' కు సీక్వెల్ మాత్రం కాదు...అల్లరి నరేష్
రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ చేసిన సినిమా పేరును నా సినిమాకు పెట్టడంతో ఓ పక్క భయంగా ఉన్నా...అది బాధ్యతగా భావిస్తున్నాను. ఇది నాటి అహ నాపెళ్లంటకు సీక్వెల్ మాత్రం కాదు అంటూ అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు. నరేష్ హీరోగా వీరభద్ర చౌదరి దర్శకత్వంలో బిందాస్ నిర్మాతలు నిర్మిస్తున్న చిత్రానికి అహనా పెళ్ళంట అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. అలాగే ఈ టైటిల్ కి మ్యాచ్ ఫిక్సింగ్ అనే ట్యాగ్ లైన్ గా పెట్టారు. ఈ సందర్భంగా మీడియా సమవేసం ఏర్పాటు చేసారు.
అలాగే ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న డా.శ్రీహరి మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఈ టైటిల్ ను ప్రకటించడానికి కూడా ఓ ధైర్యం కావాలి. అహ నా పెళ్లంట అన్న టైటిల్ ఈ సినిమాకు పెట్టడం నిజంగా సాహసోపేత నిర్ణయమే. నాటి అహనా పెళ్లంట కు ఏ మాత్రం తగ్గని రీతిలో దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు అన్నారు.
ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కోకాపేటలోని మర్యాద రామన్న హౌస్ లో పూర్తి చేసుకుంది. అలాగే ఈ చిత్రం ద్వారా రీతూ అనే హీరోయిన్ పరిచయం అవుతోంది. మరో ప్రక్క ఈ చిత్రం కొరియన్ చిత్రం మారియింగ్ మాఫియా అనే చిత్రం ఫ్రీమేక్ అని అంతటా వినపడుతోంది. ఇక ఈ అహనా పెళ్ళంట టైటిల్ గతంలో రాజేంద్ర ప్రసాద్ తో జంధ్యాల సృష్టించిన అధ్బుతమైన కామిడీకి పెట్టారన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











