twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘యముడికి మొగుడు' టైటిల్ నే ఖరారు చేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ తాజా చిత్రానికి 'యముడికి మొగుడు'టైటిల్ ని ఖరారు చేసారు. మొదట యముండ,నెల తక్కువోడు టైటిల్స్ అనుకున్నా ఈ టైటిల్ కే క్రేజ్ వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. యమలోకం బ్రాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రాన్ని ఇ.సత్తిబాబు డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లుడా మజాకాలోని సూపర్ హిట్ సాంగ్..అత్తో అత్తమ్మ కూతురోని కూడా రీమిక్స్ చేస్తున్నారు. ఈ సారి అత్తగా రమ్యకృష్ణ కనిపించి అలరించనుంది. గతంలో ఇదే టైటిల్ పై చిరంజీవి చిత్రం వచ్చింది. 1988 వచ్చిన ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది.

    దర్శకుడు ఇ.సత్తిబాబు కథ గురించి చెపుతూ...ఈ చిత్రం కథలో యమలోకం వెళ్లిన అల్లరి నరేష్ ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ అల్లరి నరేష్ మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. ఆ తర్వాత జరిగిన కథేమిటో తెరపైనే చూడాలంటున్నారు.

    అలాగే ''తెలుగు తెరపైకి యముడి నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ చక్కటి విజయాన్ని సాధించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ఇది. నరేష్‌ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయే పాత్రను ఇందులో పోషిస్తున్నారు. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్‌ చేసి చూపిస్తున్నాం. యముడిగా సాయాజీషిండే, ఆయన భార్యగా రమ్యకృష్ణ పాత్రలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ.. ''యముడి నేపథ్యాన్ని ఎంచుకుని తీసిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నా నమ్మకం. నరేష్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా. కీలక సన్నివేశాలతో పాటు, ఇటీవలే నాయకానాయికలు, రమ్యకృష్ణలపై ఓ గీతాన్ని తెరకెక్కించాం. ఫిల్మ్‌సిటీలో భారీ సెట్లు నిర్మించాము .''అన్నారు.

    యముడిగా సాయాజీ షిండే, యముని భార్యగా రమ్యకృష్ణ కీలక భూమికలు పోషిస్తున్నారు'' అని దర్శకుడు తెలిపారు. గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు, కృష్ణభగవాన్, రఘుబాబు, సుధ, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు.

    English summary
    Yamudiki Mogudu is the title that is almost finalized for Allari Naresh's new socio-fantasy entertainer. The film is being directed by E Sattibabu and has newcomer Richa Panai as heroine. The movie is set in the backdrop of Yamalokam. Hence the title has reportedly been chosen. Earlier, Nela Takkuvodu and Yamunda were the titles considered for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X