twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతలకు వరాలిచ్చే దేవుడు: అల్లరి నరేష్

    By Sindhu
    |

    ప్రేక్షకుల చేత తియ్యని 'మడత కాజా"ను 'అల్లరి"నరేష్ త్వరలోనే తినిపించనున్నారు. ఆయన కథానాయకుడిగా సీతారామరాజు దంతులూరి దర్శకత్వంలో వేదరాజు టింబర్ నిర్మిస్తున్న 'మడత కాజా" చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. టైటిల్‌కి తగ్గట్టుగా ఇందులో ఆయన పాత్ర సాగుతుందని సమాచారం. మాటల గారడీతో ఎదుటివారిని మత్తులో పడేయడం ఇందులో ఆయన పాత్ర నైజం. స్నేహా ఉల్లాల్ ఇందులో నాయిక. నరేష్, స్నేహా ఉల్లాల్ కాంబినేషన్ సన్నివేశాలు యూత్‌ ని గిలిగింతలు పుట్టిస్తాయంటున్నారు.

    ఖచ్చితంగా అల్లరి నరేష్ ప్రొడ్యూసర్ల పాలిట వరాలిచ్చే దేవుడిగా నిలిచిపోయాడని చెప్పొచు ఈ హీరోతో సినిమా తీస్తే మినిమం గ్యారంటి ఉంటుంది అన్న భరోసా నిర్మాతలకు ఏర్పడిపోయింది. అతను చేసిన సినిమాలన్నీ ఈ కోవకు చెందినవే. అందుకే అంత భరోస. ఏ కథాంసమైనా, హాస్యంతో మిళితమై ఉండటమే అల్లరి నరేష్ స్పెషాలిటి. ఆఖరికి విలన్ పాత్రలు సైతం కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయ్.

    ఈ తరహ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ 'మడత కాజా".. స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటిస్తుంది. చమత్కారమైన టైటిల్ తో వస్తున్న ఈ మూవీ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా రెండు గంటల వినోదాల విందు అంటున్నారు నిర్మాత. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి సినిమా నచ్చి తీరుతుందట. ఇవివి సత్యనారాయణ పరమపదించిన తర్వాత వస్తున్న ఈ మూవీ ఇవివి బ్రాండ్ కు పునరుత్తేజం ఇస్తుందని ఆశిద్దాం.

    English summary
    Allari Naresh surely must be a producer’s delight. This is one hero who really gives strength and substance to the concept of “minimum guarantee.” In all his movies, there are a few minimum guarantees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X