twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లోనే హ్యాపీ, మా జీవితాల్లో ఉండదు: అల్లరి నరేష్ భావోద్వేగం

    By Bojja Kumar
    |

    సినిమా ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామని, డైరెక్టర్ అవుదామని ఎన్నో కలలతో వచ్చిన వారిలో 90 శాతం మంది పెయిల్యూర్ అవుతుంటారు. వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని లైట్ బాయ్ గానో, డ్రైవర్లుగానో, జూనియర్ ఆర్టిస్టుగానో కాలం వెళ్లదీసే వారు ఎందరో.

    అనారోగ్యం కారణంగానో, సరైన ఉపాధి లేక పోవడం వల్లనో కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం 'మనం సైతం' అనే సంస్థను ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 'మనం సైతం' సంస్థ కష్టాల్లో ఉన్న పది మంది ఇండస్ట్రీకి వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

     ఆ కవిత మా జీవితాలకు సరిగ్గా సరిపోతుంది

    ఆ కవిత మా జీవితాలకు సరిగ్గా సరిపోతుంది

    నేను యాక్టింగ్ క్లాసులకు వెళ్లినపుడు ఒకటి నేర్పించారు. ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరే- నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే... ఇది శ్రీ శ్రీ గారి కవిత. మా సినిమా ఇండస్ట్రీకి ఇది సరిగ్గా సరిపోతుంది.... అని అల్లరి నరేష్ తెలిపారు.

    అలాంటివి విన్నపుడు చాలా బాధనిపిస్తుంది

    అలాంటివి విన్నపుడు చాలా బాధనిపిస్తుంది

    సినిమా ఇండస్ట్రీలో లైమ్ లైట్‌లో ఉన్నవారి గురించే అందరికీ తెలుసు. కానీ మేము తెర మీదకు రావడానికి వెనక చాలా మంది కష్టపడతారు. లైట్ బాయ్ గా, కారావాన్ డ్రైవర్‌గా, మేకప్ అసిస్టెంటుగా ఇలా ఎంతో మంది పని చేస్తుంటారు. వార ఒక వయసు వరకు తమలో సత్తా ఉన్నంత వరకు పని చేస్తారు. కొందరు షూటింగుల్లో ప్రమాదాలకు గురై పని చేయలేని స్థితికి వస్తారు. ఇలా ఎన్నో జరుగుతుంటాయి. మన సినిమాకు కాక పోయినా ఎక్కడో వేరే సినిమా షూటింగులో అలా జరిగినట్లు తెలిస్తేనే చాలా బాధ అనిపిస్తుంది.... అని అల్లని రేష్ తెలిపారు.

    సినిమాల్లోనే హ్యాపీ, మా జీవితాల్లో ఉండదు

    సినిమాల్లోనే హ్యాపీ, మా జీవితాల్లో ఉండదు

    కేవలం సినిమాల్లోనే మేము హ్యాపీగా ఉన్నట్లు కనపిస్తాం. కానీ ఇండస్ట్రీలో చాలా మంది జీవితాల్లో హ్యాపీ ఉండదు. ఉదాహరణకు ఓ విషయం చెబుతాను. నేను యాక్టింగ్ నేర్చుకునేపుడు 106 మంది ఉండేవారం. దాంట్లో ఆరుగురు మాత్రమే ఆర్టిస్టులు అయ్యారు. మిగతావారు ఎక్కడ ఉన్నారో తెలియదు.... అని అల్లరి నరేష్ తెలిపారు.

    అతడు ఆ విషయం చెప్పగానే బాధేసింది

    అతడు ఆ విషయం చెప్పగానే బాధేసింది

    మొన్న ఎక్కడో యాక్టింగ్ క్లాస్ ఫ్రెండు కనిపించాడు. ఏం చేస్తున్నావంటే జూనియర్ ఆర్టిస్టుగా చేస్తున్నానని చెప్పాడు.‘చాలా సంవత్సరాల ట్రై చేశాను.... ఇంటికెళ్లే పరిస్థితి లేక పోవడంతో సినిమానే నమ్ముకుని ఇక్కడే ఉండిపోయాను. కృష్ణా నగర్లో తిరుగుతుంటే జూనియర్ ఆర్టిస్టుగా అవకాశం వస్తే చేసుకుంటూ జీవిస్తున్నాను' అని చెప్పాడు. అతడు ఆ విషయం తెలిసిన వెంటనే చాలా బాధేసింది.... అని అల్లరి నరేష్ తెలిపారు.

     90 శాతం మంది కల నెరవేరడం లేదు

    90 శాతం మంది కల నెరవేరడం లేదు

    ఎంతో మంది ఎన్నో కలలతో సినిమా ఇండస్ట్రీకి వస్తారు. అందులో కొందరి కలలు మాత్రమే నెరవేరుతారు. 90 శాతం మంది కల నెరవేరడం లేదు. ఆ విషయాన్ని వెళ్లి ఎవరికీ చెప్పుకోలేరు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కష్టపడుతూ జీవిస్తున్న వారికి సహాయం అందించేందుకు ‘మనం సైతం' సంస్థ ఏర్పడటం ఆనందంగా ఉంది అని అల్లని నరేష్ తెలిపారు.

    English summary
    Allari Naresh heart touching speech about film industry at Manam Saitham Press Meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X