అల్లరి నరేష్ హీరోయిన్ ...రవితేజతో కమిటయ్యింది
అల్లరి నరేష్ తో సిద్దు ప్రమ్ సికాకుళం,శుభప్రదం చిత్రాల్లో చేసిన ,మంజరి పర్నాండేస్ కి తాజాగా రవితేజ సరసన చిత్రం కమిటయ్యింది. రమేష్ వర్మ దర్సకత్వంలో రవితేజ హీరోగా రూపొందనున్న ఆ చిత్రం టైటిల్ వీర. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అనూష్క, తాప్సీ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో అనుష్క కబడ్డీ చిట్టి అనే పాత్ర చేస్తోంది. ఈ పాత్ర పక్కా మాస్ లక్షణాలు కలిగి ఉంటుందని చెప్తున్నారు. అందులో ఆమె రవితేజను టీజింగ్ చేస్తూ కవ్వించి ప్రేమలో పడే క్యారెక్టర్ అంటున్నారు. గణేష్ ఇందుకూరి నిర్మించే ఈ చిత్రం మాస్, యాక్షన్ అంశాలతో అల్లుకొన్న వినోదాత్మకమైన కథ అని తెలిస్తోంది.
ఇక దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో భీష్మ అనే చిత్రం ప్రారంభించి ఆపుచేసారు. అయితే రైడ్ అనే చిత్రం విజయవంతం కావటంతో అతనిపై మంచి నమ్మకాలు ఉన్నాయి. రైడ్ చేయాటానికి రమేష్ వర్మ..ఒక ఊరిలో, మల్లెపూవు అనే రెండు ప్లాఫ్ చిత్రాలకు కథలు ఇచ్చారు. ఇక రవితేజ ప్రస్తుతం మిరపకాయ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ ఆ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ వీర చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు కెమెరా,పరుచూరి బ్రదర్శ్ డైలాగులు అందుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











