ఉషాకిరణ్..అల్లరి?
అల్లరి నరేష్ హీరోగా ఉషాకిరణ్ మూవీస్ వారు ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఓ చిన్న దాన వంటి కామెడీ ని తీసిన ఇ. సత్తి బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇంతక ముందు ఇ.సత్తి బాబు నరేష్ తో నేను చిత్రాన్ని తీసి ఉన్నాడు. అయితే ఆ ఫిలిం బాక్స్ ఆఫీసు వద్ద కుదేలు అవటంతో ఆ కాంబినేషన్ మళ్ళి రిపీట్ కాలేదు. అయితే నచావులే తో మళ్ళి సక్సెస్ బాట లోకి వచ్చిన ఉషా కిరణ్ వారు వరస గా చిన్న సినిమా నిర్మాణం ప్రారంభించటం కలిసివచ్చింది. వారు ప్రస్తుతం కామెడి దర్శకుడు శివ నాగేశ్వరరావు డైరక్షన్ లో ఓ చిత్రం అంతా కొత్త వారితో చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇవివి సత్యనారాయణ దర్శకుడిగా డి.రామానాయుడు నిర్మిస్తున్న 'బెండు అప్పారావు'..ఆర్ఎంపి చిత్రం నిర్మాణంలో ఉంది. అనంతరం ముళ్ళపూడి వీరభద్ర చౌదరి అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో ఓ చిత్రం కమిట్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











