»   »  కేసీఆర్‌ను కలిసిన అల్లరి నరేష్, అందుకేనా..(ఫోటోస్)

కేసీఆర్‌ను కలిసిన అల్లరి నరేష్, అందుకేనా..(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో, యంగ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఎగేజ్మెంట్ మే 1న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మే 29న విరూపతో నరేష్ వివాహం జరుగనుంది. ప్రస్తుతం అల్లరి నరేష్ తన పెళ్లికి ప్రముఖులను ఆహ్వానిస్తూ బిజీగా గడుపున్నారు. తాజాగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వానించారు.

Allari Naresh invited KCR to his marriage

మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగబోతోంది. బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశ్వీర్వదించాలని నరేష్ సోదరుడు రాజేష్ కోరారు. అల్లరి నరేష్ పెళ్లాడబోతున్న విరూపకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా పని చేస్తోంది.

Allari Naresh invited KCR to his marriage

వీరిది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్. అల్లరి నరేష్ కు తగిన జోడీ కోసం గత కొన్ని నెలలుగా కుటుంబ సభ్యులు అన్వేషణ సాగిస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన విషయాలేవీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. నిశ్చిర్థం ఫిక్సయ్యే వరకు అంతా గోప్యత పాటించారు. ఎట్టకేలు ఈ విషయం బయటకు రావడంతో నరేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Allari Naresh invited Telangana Chief Minister KCR to his marriage.
Please Wait while comments are loading...