Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇది ఫైనల్: అల్లరి నరేష్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’
హైదరాబాద్: అల్లరి నరేష్ కొత్త సినిమాకు 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' టైటిల్ ఫైనల్ చేసారు. ఈ విషయమై అల్లరి నరేష్ మాట్లాడుతూ..'నా కొత్త సినిమాకు టైటిల్ సెలెక్ట్ చేయడంలో వేల సంఖ్యలో సినీ అభిమానులు పాలు పంచుకోవడం...మా సినిమాకు 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' అనే ఎక్సలెంట్ టైటిల్ ఫిక్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది' అన్నారు.
ఫేస్ బుక్ పోస్టింగ్స్, ఈమెయిల్స్ ద్వారా జరిగిన పోలింగులో దాదాపు 80 శాతం మంది 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' టైటిల్ కే ఓటేసారు. ఈ సందర్భంగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అల్లరి నరేష్ వ్యాఖ్యానించారు.
అల్లరి నరేష్ కథానాయకుడిగా ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రానికి 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' అనే టైటిల్ ఆడియన్స్ పోల్ ద్వారా ఖరారు చేసారు. అల్లరి నరేష్ సరసన 'సుడిగాడు' ఫేం మోనాల్ గజ్జర్ కథానాయకి కాగా, నరేష్‌కు ట్విన్ సిస్టర్ గా 'రంగం' ఫేం కార్తీక నటిస్తోంది. 'వీడు తేడా' ఫేం బి.చిన్ని దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అమ్మిరాజు కానుమల్లి మాట్లాడుతూ...'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' చాలా మంచి టైటిల్. అల్లరి నరేష్ కు ఇది యాప్ట్ అవుతుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ నెలాఖరుకు ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి, సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేస్తాం. సెప్టెంబర్ రెండో వారంలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
హర్షవర్దన్ రాణె, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, అభిమన్యు సింగ్, కెల్లీ డార్జ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : శేఖర్ చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, ఎడిటింగ్: గౌతంరాజు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్ అడుసుమిల్లి, కథ: విక్రమ్ రాజ్, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అమ్మిరాజు కానుమల్లి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.చిన్ని.