ఆమెతో కలిసి అల్లరి నరేష్ వజ్రాల వేట

By Srikanya

Allari Naresh and Isha Chawla Searching For Diamonds
హైదరాబాద్ : అల్లరి నరేష్ తో జతకట్టిన ఇషా ఛావ్లా ఇప్పుడు వజ్రాల వేటలో నిమగ్నమైంది. జంపు జిలాని టైటిల్ తో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో వజ్రాల వేట ప్రధానంగా సాగుతూ కామెడీ పంచుతుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కలగలప్పు' చిత్రానికి రీమేక్ ఇది. శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ పతాకంపై అంబికా రాజా నిర్మిస్తున్నారు. రిలియన్స్ వారు ఫైనాన్స్ చేస్తున్నారు. అల్లరి నరేష్ తొలి ద్విపాత్రాభినయం ఇది.

సమర్పకులు అంబికా కృష్ణ మాట్లాడుతూ ''కలగలుపు అనే తమిళ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈవీవీ సత్యనారాయణతో నాకు మంచి అనుబంధం ఉంది. మా సంస్థకు 'కన్యాదానం'లాంటి సినిమా ఇచ్చారు. ఇప్పుడు నరేష్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది''అన్నారు.అంబికా, అంబానీ, అల్లరి నరేష్ అనే మూడు శక్తులతో ఈ సినిమా రూపొందుతోందని వ్యాఖ్యానించారు. ఈవీవీతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందనీ, ఆయన కుమారుడు అల్లరి నరేష్ తన కొడుకులాంటివాడేననీ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.... ''సీమశాస్త్రిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి పాత్ర 'గమ్యం'లో గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది''అన్నారు‌. తమిళంలో 'కలగలప్పు' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామన్నారు. హీరోగా ద్విపాత్రాభినయం చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారి (ఈవీవీ) 'హలోబ్రదర్' తరహాలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామని నరేష్ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... '' 'తాతల ఆస్తుల కోసం ఆరాటపడే వారసుల గురించే మనకు తెలుసు. కానీ, మా హీరో తాతల పేరు నిలబెట్టడానికి, వారి వారసత్వాన్ని కాపాడుతాడు. అందుకోసం అతను ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథహలో బ్రదర్‌ నాగార్జునకు ఎంత పేరు తీసుకొచ్చిందో.. మా సినిమా నరేష్‌కు అంత పేరు తీసుకొస్తుంది. తొలిసారి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి పాత్ర క్లాస్‌. మరోటి మాస్‌. తరతరాలుగా వస్తున్న ఆస్తిని హీరో ఎలా కాపాడుకొన్నాడు అనేదే ఈ చిత్ర కథ.'' అన్నారు. కథ: సుందర్‌ సి, సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అంబికా కృష్ణ అండ్‌ బ్రదర్స్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X