మడతెట్టేయమే పనిగాపెట్టున్న 'కత్తి కాంతారావు' (ప్రివ్యూ)
అల్లరి నరేష్, కామ్నా జఠ్మలానీ కాంబినేషన్ లో బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి కాంతారావు" (ఎవడ్నయినా మడతెట్టేస్తాడు) చిత్రం ప్రస్తుతం ఈ రోజు(10, డిసెంబర్)న విడుదల అవుతోంది. కాంతారావు (నరేష్) కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుంటాడు. ఎవర్నయినా ఇట్టే మడతెట్టేసే తెలివితేటలు అతని సొంతం. వాళ్ల నాన్న (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) కూడా అంతే. ఎవరైనా తమ బిడ్డలకు వారసత్వంగా ఆస్తులు పంచితే... అతనేమో బాధ్యతలు పంచాడు. వాటి నుంచి తప్పించుకోకుండా ఒప్పంద పత్రం మీద సంతకం కూడా చేయించుకొంటాడు. అసలు ఆ ఒప్పందం ఎందుకోసం? రత్నం (కామ్నాజెఠ్మలానీ)తో కాంతారావు ప్రేమ వ్యవహారం ఎంత వరకూ వచ్చింది? అనేవి ఆసక్తికరం. అలాగే ఈ చిత్రంలో కానిస్టేబుల్‌నుంచి ఎస్‌ఐ, ఐజివరకు ఎవరినైనా మడతెట్టే కానిస్టేబుల్ పాత్రలో నరేష్ నటించాడు. అతనికి నలుగురు అక్క చెల్లెళ్లు, బావలుంటారు. వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించారన్నదే ఈ చిత్రకథ. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు ఈవీవి చెబుతూ..ఆద్యంతం వినోదభ రితంగా ఉండే చిత్రమిది. తండ్రికి ఇచ్చిన మాట కోసం కాంతారావు పడిన అగచాట్లు నవ్విస్తాయి. ప్రతి దృశ్యం హాస్యం పండిస్తుంది. సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా నవ్వించే ప్రయత్నం చేశాం. 'ఆ ఒక్కటీ అడక్కు', 'అప్పుల అప్పారావు' సినిమాల తరువాత ఆ స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా ఇదేనంటున్నారు.


Click it and Unblock the Notifications











