ఎంతటోళ్ళనయినా మడతెట్టేస్తానంటున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్, కామ్నా జఠ్మలానీ జంటగా బిగ్‌బి ప్రొడక్షన్స్ పతాకంపై ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న 'కత్తి కాంతారావు" (ఎవడ్నయినా మడతెట్టేస్తాడు) చిత్రం ప్రస్తుతం డిటిఎస్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఈనెల 24న విడుదల చేయను న్నారు. ఈ సందర్భంగా ఇవివి మాట్లాడుతూ -ఆద్యంతం వినోదభ రితంగా ఉండే చిత్రమిది. అప్పుల అప్పారావు మాదిరి కుటుం బ సభ్యులందరిని కడుపుబ్బ నవ్విస్తుంది. కానిస్టేబుల్‌నుంచి ఎస్‌ఐ, ఐజివరకు ఎవరినైనా మడతెట్టే కానిస్టేబుల్ పాత్రలో నరేష్ నటించాడు. అతనికి నలుగురు అక్క చెల్లెళ్లు, బావలుంటారు. వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించారన్నదే ఈ చిత్రకథ అని తెలిపారు.
అలాగే అల్లరి నరేష్ తాజాగా మడతకాజా అనే చిత్రాన్ని కూడా కమిటయ్యారు. నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సీతారామరాజు అనే అసెస్టెంట్ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని గతంలో టాస్, అధినేత చిత్రాలను నిర్మించి ప్రస్తుతం వరుణ్ తో ఏమైంది ఈ వేళ చిత్రాన్ని నిర్మిస్తున్న రాదామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రంలో నరేష్...బ్లఫ్ మాస్టర్ తరహాలో వుండే పాత్రను చేయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం నరేష్...కత్తి కాంతారావు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క వీరభధ్రంని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న అహనా పెళ్ళంట చిత్రంలోనూ నరేష్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











