For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రైమ్ కామెడీ ( కెవ్వు కేక ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: అల్లరి నరేష్‌, షర్మిల మాండ్రే జంటగా దేవీప్రసాద్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'కెవ్వుకేక'. జాహ్నవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కామెడీ క్రైమ్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల చేత కెవ్వుకేక పెట్టిస్తుందని దర్శకుడు దేవీప్రసాద్‌ తెలిపారు. ఎలాంటి అశ్లీలత, ద్వందార్థాలకు తావులేకుండా ఇంటిల్లిపాది చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, కెవ్వుకేక విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  బుచ్చిబాబు (నరేష్‌) ఓ సేల్స్‌మేన్‌. మహాలక్ష్మి (షర్మిలా మాండ్రే)తో ప్రేమలో పడతాడు. అయితే మహాలక్ష్మి నాన్న సుబ్బారావు (ఎమ్మెస్‌ నారాయణ)కి డబ్బు పిచ్చి. తన కూతుర్ని కోటీశ్వరుడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు. ఆరు నెలల్లో కోట్లు సంపాదించాకనే నీ కూతుర్ని పెళ్లిచేసుకొంటా... అని ఛాలెంజ్‌ చేస్తాడు బుచ్చిబాబు. కానీ డబ్బులు ఎలా సంపాదించాలో తెలీదు. ఈ ప్రయాణంలో బ్యాంకాక్‌లో ఉన్న గొట్టం గోపాలకృష్ణ (ఆశిష్‌ విద్యార్థి) గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి బుచ్చిబాబుకి. ఇంతకీ ఆ గోపాల కృష్ణకీ, బుచ్చిబాబుకీ ఉన్న సంబంధం ఏమిటి? బుచ్చిబాబు కోట్లు ఎలా కూడ బెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.

  దర్శకుడు మాట్లాడుతూ....ప్రథమార్ధం హైదరాబాద్, ద్వితీయార్ధం బ్యాంకాక్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఫక్తు టైమ్‌పాస్ సినిమా. 'నా పేరు ధర్మరాజు కాదు.. దిల్ రాజు కాదు.. బుచ్చిరాజు' అనేది హీరో చెప్పే డైలాగ్. అదే అతని కేరక్టరైజేషన్. నరేశ్ అంటే జనం ఏం ఆశిస్తారో ఆ విధంగానే ఈ సినిమా ఉంటుంది. ఒక హాలీవుడ్ సినిమాలో చూసిన ఓ పాయింట్ ఇచ్చిన ప్రేరణతో ఈ సినిమా కథని నేనూ, రచయిత వేగేశ్న సతీశ్ కలిసి తయారు చేశాం అన్నారు.

  నిర్మాత మాట్లాడుతూ ''ఆద్యంతం సరదాగా సాగిపోయే సినిమా ఇది ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా సినిమా తీశాం. ప్రతి పాత్ర నవ్వించడానికే. నరేష్‌ పంచిన వినోదం గుర్తిండిపోతుంది. నాలుగు పాటలున్నాయి. వాటిని చిత్రీకరించిన విధానం ఆకట్టుకొంటుంది. సతీష్‌ వేగేశ్న సంభాషణలు అలరిస్తాయి'' అన్నారు.

  సంస్థ: జాహ్నవి ప్రొడక్షన్స్‌

  నటీనటులు: అల్లరి నరేష్‌, షర్మిలా మాండ్రే, ఆశిష్‌ విద్యార్థి, ఎమ్మెస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, సన, గీతాసింగ్‌, జ్యోతి, అపూర్వ తదితరులు.

  కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్,

  మాటలు: వేగేశ్న సతీష్,

  కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్,

  సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్,

  ఎడిటర్: నందమూరి హరి,

  నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు,

  సమర్పణ: శ్రీమతి నీలిమ,

  స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.

  నిర్మాత: బొప్పన చంద్రశేఖర్‌

  విడుదల: శుక్రవారం.

  English summary
  Allari Naresh’s latest film Kevvu Keka relesing today. Devi Prasad is the director of Kevvu Keka touted to be a laugh riot shot in the locales of Bangkok, Hyderabad and Sharmila Mandre will be seen as the heroine in this movie. The film is produced by Boppana Chandra Sekhar under Jahnavi Productions banner while Smt. Neelima will present the movie. Chinni Charan, Bheems composed the music. Kevvu Keka casting MS Narayana, Jeeva, Nisha, Krishna Bhaghavan, Ali, Mumaith Khan,Ashish Vidhyarth in prominent roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X