రెగ్యులర్ షూటింగులో అల్లరి నరేష్ ‘కెవ్వు కేక’
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. నరేష్ పాత్ర చిత్రానికి హైలెట్ గా ఉంటుంది. నవంబర్ 1 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. ఈ నెల 15 వరకు జరిగే ఈ చిత్రీకరణ తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. డిసెంబర్ 20 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ 'నరేష్ పాత్ర వైవిద్యంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం పూర్తి వినోదభరితంగా ఉంటుంది. తప్పకుండా నరేష్, నా కాంబినేషన్ మరో విజయవంతమైన చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం ఉంది' అన్నారు. అల్లరి నరేష్ సినిమాల నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈచిత్రంలో ఉంటాయన్నారు.
నరేష్, షర్మిల మాంద్రే, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.


Click it and Unblock the Notifications












