twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత ఊళ్లో అల్లరి నరేష్ చిత్రం షూటింగ్

    By Srikanya
    |

    Allari Naresh
    నిడదవోలు : పశ్చిమగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెంలో వేంచేసిఉన్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో అల్లరి నరేష్‌ చిత్రం షూటింగ్ జరుగుతోంది. నరేష్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న వెంకటేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెంబర్‌-1 చిత్రీకరణకు సంబంధించిన పలు సన్నివేశాలను హీరోయిన్‌ స్వాతిదీక్షిత్‌పై చిత్రీకరించారు. ఇంకా రావు రమేష్‌, ఖయిమ్‌లతో పాటు హాస్యనటులు రఘుబాబు, వేణుమాధవ్‌లపై కూడా మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. నరేష్ సొంత ఊరు దగ్గరలోని కోరుమామిడి కావటంతో నరేష్ బంధువులు చాలా మంది అక్కడికి రావటం జరిగింది.

    అమ్మవారి ఆలయంలో తీర్థం జరుగుతుండగా, హీరోయిన్‌ ఆలయం నుంచి బయటకు వచ్చి నడచి వెళ్లుతుండగా, బస్‌లో వస్తున్న రఘుబాబు ఈ అమ్మాయి మా అమ్మాయే బస్‌ ఆపండి... ఆపండి... అంటూ గట్టిగా ఆరిచే సన్నివేశాన్ని చిత్రీకరించారు. వేణుమాధవ్‌ పోలీస్‌ డ్రస్‌లో తలకు కట్టుకుని ఉన్నారు. ఈ చిత్రానికి జంప్ జిలాని అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

    నరేష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, హలోబ్రదర్‌లో నాగార్జునకు ఎంత పేరొచ్చిందో ఈ చిత్రంలో కూడా అదే విధంగా నరేష్‌కు పేరొస్తుందని, కవల సోదరుల్లో ఒకరు క్లాస్ కాగా, ఒకరు మాస్‌గా ఉంటారని, తరతరాలుగా వస్తున్న తమ సంపదను హీరో ఎలా కాపాడుతున్నారన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని చిత్ర దర్శకుడు ఇ.సత్తిబాబు తెలిపారు.

    నరేష్ మాట్లాడుతూ ...ఈ చిత్రంలోని పాత్ర సీమశాస్ర్తీ, గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని తెలిపారు. అంబికాకృష్ణ సమర్పణలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా దర్శకుడు ఇ.సత్తిబాబు నటీనటులకు పలు సూచనలు అందించారు. రానున్న రోజుల్లో అల్లరి నరేష్‌, ఇంకా రావు రమేష్‌, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్‌, ఖయిమ్‌, ఎం.ఎస్‌.నారాయణ, కవిత, రఘుబాబు తదితరులపై సన్నివేశాలను నిడదవోలు ప్రాంతంలోనే చిత్రీకరించనున్నారు.

    తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు' అనే సినిమా రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. రీసెంట్ గా నరేష్‌ - సత్తిబాబు కలయికలో 'యముడికి మొగుడు' వచ్చింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. తమిళంలో సూపర్ హిట్టైన 'కలగలప్పు' ఇద్దరికీ విజయం తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఇక 'కలగలప్పు' చిత్రం ఇద్దరు స్నేహితులు తమ వారసత్వంగా వచ్చిన రెస్టారెంట్ ని ఓ రియల్ ఎస్టేట్ డవలపర్ నుంచి కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలతో రూపొందింది. ఈ చిత్రం సోల్ కిచెన్ అనే జర్మినీ చిత్రం ఆధారంగా రూపొంది తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది.

    కోట శ్రీనివాసరావు, స్వాతిదీక్షిత్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, రావురమేష్, వేణుమాధవ్, ధన్‌రాజ్, తా.రమేష్, జి.వి, సన, హేమ, గీతాసింగ్, ఖయ్యూమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సుందర్ సి, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, సంగీతం: విజయ్ ఎబెంజర్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: అంబికా రాజా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

    English summary
    Allari Naresh is all set for his new film ‘Jump Jilani’ with comedy director E Satti Babu. Earlier these duo worked before Nenu, Betting Bangarraju and Yamudiki Mogudu. Ambica Krishna is going to produce the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X