'ఆయనకి ఐదుగురు' అంటున్నారు
గతంలో జగపతి బాబు హీరోగా 'ఆయనకి ఇద్దరు' చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. మరి ఆ స్పూర్తితో కథ అల్లుకున్నారో ఏమో కానీ త్వరలో 'ఆయనకి ఐదుగురు' టైటిల్ తో ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రం లోగోని హీరో 'అల్లరి' నరేష్ ఆవిష్కరించారు. ఏవన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రణదీప్ హీరోగా, సదా, రీమాసేన్, దివ్యదత్తా, కల్పన, సోనాలి కులకర్ణి, రీతూపర్ణ ఘోష్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భాష్యం శ్రీనివాస్ పరిచయమవుతున్నారు.
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే...ఈ సినిమా కథ ఫైవ్‌స్టార్ హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఆ హోటల్‌లో ఛెఫ్‌గా పనిచేసే రణదీప్, రిసెప్షెనిస్ట్ సదా, ఆ హోటల్ రెగ్యులర్ కష్టమర్ సోనాలి కులకర్ణి, లైబ్రరీ ఇన్‌ఛార్జి రీతుపర్ణ ఘోష్, హీరో అపార్ట్‌మెంట్ పక్క పోర్షన్‌లో ఉండే దివ్యదత్తా, ఇంటర్ విద్యార్థిని రీమాసేన్... ఈ పాత్రల చుట్టూ చిత్రకథ నడుస్తుంది. జీవితాన్ని సరదాగా గడపాలని, తనకు నచ్చిన యువతులతో పరిచయం చేసుకుని, స్నేహం పెంచుకుని వారితో ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం కలిగిన యువకుని కథ ఇది.


Click it and Unblock the Notifications











