»   » గోప్యంగా ఏర్పాట్లు: అల్లరి నరేష్ పెళ్లి డేట్ ఫిక్సయింది

గోప్యంగా ఏర్పాట్లు: అల్లరి నరేష్ పెళ్లి డేట్ ఫిక్సయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిర్లలో ఒకరిగా ఉన్న కామెడీ స్టార్, యువ హీరో అల్లరి నరేష్ పెళ్లి ఎట్టకేలకు సెటిలయింది. చెన్నైలో సెటిలైన కృష్ణా జిల్లాకు చెందిన విరూప అనే అమ్మాయితో అతని పెళ్లి జరుగబోతోంది. ఈ రోజు(మే 1) సాయంత్రం చెన్నైలోని లీలా ప్యాలెస్ లో నిశ్చితార్థం జరుగనుంది. మే 29 రాత్రి 9 గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్సయింది.

అల్లరి నరేష్ కు తగిన జోడీ కోసం గత కొన్ని నెలలుగా కుటుంబ సభ్యులు అన్వేషణ సాగిస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన విషయాలేవీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. నిశ్చిర్థం ఫిక్సయ్యే వరకు అంతా గోప్యత పాటించారు. ఎట్టకేలు ఈ విషయం బయటకు రావడంతో నరేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Allari Naresh marriage on may 29

అల్లరి నరేష్ సినిమాల విషయానికొస్తే....గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో బాక్సాఫీసును తన కామెడీ పంచ్ లతో హోరెత్తించిన అల్లరి నరేష్ జోరు ప్రస్తుతం కాస్త తగ్గింది. త్వరలో అల్లరి నరేష్ ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ‘జేమ్స్ బాండ్...నేను కాదు నా పెళ్లాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అల్లరి నరేష్ కెరీర్లో ఇది 49వ సినిమా. పార్టీలు పబ్బులూ అంటూ తిరిగే మోడ్రన్ అమ్మాయి అవసరం లేదని, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా చక్కబెట్టే సాంప్రదాయ బద్దమైన అమ్మాయి కావాలని అల్లరి నరేష్ కోరుకున్నాడు. ఇపుడు అలాంటి అమ్మాయే దొరకడంతో అల్లరి నరేష్ చాలా హ్యాపీగా ఉన్నాడట.

English summary
Tollywood star Allari Naresh marriage on may 29.
Please Wait while comments are loading...