'మర్యాద రామన్న' ఇంట్లో అల్లరి నరేష్ హంగామా
అల్లరి నరేష్ ప్రస్తుతం సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న ఇంట్లో హంగామా చేస్తున్నారు. కోకాపేట లో నిర్మించిన ఈ ఇంటిసెట్ లో ఆయన తాజా చిత్రం సిల్లీఫెలో షూటింగ్ జరుపుకుంటోంది. వీరభద్ర చౌదరి అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని బిందాస్ నిర్మించిన ఎకె.ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా రీతు అనే హీరోయిన్ పరిచయం కానుంది. ఇందులో శ్రీహరి కూడా ఓ ప్రధాన పాత్రను చేస్తున్నారు.
అలాగే ఈ చిత్రం 'మ్యారియింగ్ మాఫియా' అనే కొరియా చిత్రం ఆధారంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇక 'మ్యారియింగ్ మాఫియా' ఆధారంగా హిందీలో 'వెలకమ్' చిత్రం వచ్చింది. అయితే వెలకమ్ లో కొన్ని ట్రాక్ లు శ్రీను వైట్ల 'కింగ్' లో లేపేసారు. కాబట్టి మిగిలిన వాటిమీదే ఆధారపడాలి. ఇక ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్, నాగినీడు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, ధర్మవరపు, రంజిత వంటి వారు నటిస్తున్నారు. అలాగే సంగీతం రఘు కుంచె అందిస్తూంటే లోకనాధ్ కెమెరా వర్క్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications