twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌కి అల్లరి నరేష్ చిత్రం

    By Bojja Kumar
    |

    అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ బాబుల కళ్లు పడ్డాయి. ఇంకేం... అనుకున్నదే తడువుగా ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూజా ఫిల్మ్ వారు ఈ చిత్రాన్ని హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క రీమేక్ హక్కులు దక్కించుకున్నారు కూడా. జాకీ భగ్నాని ఈచిత్రంలో అల్లరి నరేష్ పాత్రలో నటించనున్నడు.

    ధూమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజయ్ గాంధీ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. సాజిద్-వాజిద్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో తెలుగులో సూర్ హిట్టయిన పోకిరి, రెడీ లాంటి చిత్రాలు బాలీవుడ్లోనూ కాసుల పంట పండించిన విషయం తెలిసిందే. మరి అల్లరి నరేష్ ఏ రేంజ్ లో సత్తా చాటు తుందో చూడాలి.

    ప్రస్తుతం అల్లరి నరేష్ 'నెలతక్కువోడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు అనిల్ సుంకర దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

    English summary
    Allari Naresh's Seema Tapakai movie to be remade in Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X