twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రూట్లో కూడా భారీగా ప్రాఫిట్స్ అందించిన అల్లరి నరేష్.. మొత్తానికి మార్కెట్ సెట్టయ్యింది!

    |

    కామెడీ సినిమాలతో గతంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలను అందుకున్న అల్లరి నరేష్ ఏడాదికి నాలుగైదు సినిమాలకు తక్కువ చేసేవారు కాదు. కామెడీ హీరోగా ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న నరేష్ అప్పుడప్పుడు ఆ మార్క్ ను దాటేసి ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. ఆ స్టైల్ లో వచ్చిందే నాంది. గతంలో గమ్యం సినిమాతో నరేష్ జనాలకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. ఇక మళ్ళీ ఆ తరువాత నాంది సినిమాతో అదే తరహాలో ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యాడు. దాదాపు ఈ సినిమా అన్ని దారుల్లో కూడా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

     80% ప్రాఫిట్స్

    80% ప్రాఫిట్స్

    నరేష్ 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయం నాంది ద్వారా అందుకున్నాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే సరికొత్త కాన్సెప్ట్ అంటూ హైప్ గట్టిగానే క్రియేట్ చేశారు. ఇక మొత్తానికి విడుదల రోజు నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. 5రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంది. ఇక రెండు వారాలకు సినిమా పెట్టిన పెట్టుబడికి 80% ఎక్కువగా ప్రాఫిట్స్ అంధించింది.

    క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..

    క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..

    అల్లరి నరేష్ 2012లో చివరగా సుడిగాడు సినిమాతో సక్సెస్ కొట్టడు. ఆ తరువాత మళ్ళీ విజయం దక్కలేదు. ఫైనల్ గా ఇన్నాళ్లకు ఒక మంచి సక్సెస్ దక్కింది. గత సినిమాలతో పోలిస్తే మొత్తానికి నాంది సినిమాతో నరేష్ ఫామ్ లోకి వచ్చేశాడని అర్ధమయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 6.4కోట్లను రాబట్టింది. దాదాపు ఇవే క్లోజింగ్ కలెక్షన్స్.

    దిల్ రాజు చేతుల్లోకి రీమేక్ రైట్స్

    దిల్ రాజు చేతుల్లోకి రీమేక్ రైట్స్

    ఇక సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ, తమిళ్, మలయాళం వంటి భాషల్లో ఇలాంటి సినిమా చేస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవుతాయని ముందే ఊహించిన దిల్ రాజు డీసెంట్ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అందులో కోటిన్నరకు పైగా లాభమే అని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది.

     ఆ రూట్లో భారీ ధరకు అమ్ముడైన నాంది

    ఆ రూట్లో భారీ ధరకు అమ్ముడైన నాంది

    ఇక డిజిటల్ హక్కులు, ఓటీటీ రైట్స్ ద్వారా కూడా సినిమాకు మాంచి లాభాలే వచ్చాయట. ఓటీటీ రైట్స్ ను ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ రూట్లో సినిమా 2కోట్లకు పైగా లాభాలను అందుకున్నట్లు సమాచారం. ఈ రేంజ్ లో వసూళ్లు అందుకుంటాయని నిర్మాతలు ఊహించలేదు. ఏదేమైనా నరేష్ నాంది అన్ని విధాలుగా మంచి ప్రాఫిట్స్ ను అందించింది.

    English summary
    Allari Naresh was once a hero in Tollywood, known as Minimum Guarantee. Naresh, who has released two to three films a year, is now not releasing a film a year later. With so many disasters at the box office, Fix is no longer required to make commercial films. Thriller is about to come up with a new kick for Next Audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X