అల్లరి నరేష్ 'నాంది' ప్రీ రిలీజ్ బిజినెస్.. మరో చిన్న టార్గెట్.. క్లిక్కయితే కాసుల వర్షమే!
అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలతో నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి మినిమమ్ లాభాలను అందించేవాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అయితే అలాంటి నటుడితో మంచి ఎమోషనల్ కథలు తెరకెక్కిస్తే కూడా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందని గమ్యం సినిమాతోనే క్రిష్ రుజువు చేశాడు. ఇక నెక్స్ట్ నాంది సినిమాతో నరేష్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
ఫోటోలు: బెంగాలీ భామ బోల్డ్ ఫోటోషూట్ మీరు ఎప్పుడూ చూడని పిక్స్

కొత్త దారిలో నరేష్
ఇటీవల బంగారు బుల్లోడు సినిమాతో డిజాస్టర్ అందుకున్న నరేష్ వరుసగా కామెడీ పాత్రలు చేయడం కూడా కరెక్ట్ కాదని భావించాడు. అప్పుడప్పుడు కొత్త దారిలో వెళుతున్నాడు. ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన నాంది ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమా బిజినెస్ కూడా ఎప్పుడో క్లోజ్ అయ్యింది.

ఆ కొత్త పాయింట్ హైలెట్..
గత ఏడాది నాంది సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన నరేష్ మొత్తానికి కెరీర్ లో చాలా రోజుల తరువాత డిఫరెంట్ హిట్ కొట్టేలా ఉన్నాడని పాజిటివ్ టాక్ అందుకున్నాడు. నాంది సినిమా కథ ఎక్కువగా ఒక జైల్లోనే కోనసాగుతుందని టీజర్ తోనే చెప్పేశారు. నేరం చేశారో.. చేయలేదో తెలియని ఖైదీలు జైళ్లలోనే ఏళ్లతరబడి శిక్ష అనుభవిస్తున్నారనే కొత్త పాయింట్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది.

న్యూస్ గా నటించిన నరేష్
అల్లరి నరేష్ లుక్ యాక్టింగ్ ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది. దాదాపు సినిమా కోసం తన శక్తిని మొత్తం ఉపయోగించడానిపిస్తోంది. పైగా మొదటిసారి న్యూడ్ సీన్స్ చేయడం కూడా అందరికి షాక్ ఇచ్చింది. సినిమాపై హైప్ అయితే గట్టిగానే క్రియేట్ అయ్యింది. గత కొంతకాలంగా అపజయాల్లో ఉన్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.

టార్గెట్ ఎంతంటే..?
ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 1కోటి రూపాయల ధర పలుకగా.. సీడెడ్ లో 30లక్షలు, ఆంద్రప్రదేశ్ లో మొత్తంగా 1.2కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన సినిమా టార్గెట్ చిన్నదే అని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా మొత్తంగా 2.5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నాంది బాక్సాఫీస్ వద్ద 3కోట్ల వరకు షేర్స్ అందుకుంటే హిట్టయినట్లు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుదని చెప్పవచ్చు. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











