Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్‌పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
Naandhi 6 days collections: భారీగా తగ్గిన కలెక్షన్స్.. ఇప్పటివరకు వచ్చిన మొత్తం లాభం ఎంతంటే?
కామెడీ హీరో అనే మార్క్ ను దాటి అప్పుడప్పుడు డిఫరెంట్ గా ప్రయోగాలు చేసే అల్లరి నరేష్ చాలా కాలం తరువాత నాంది సినిమాతో అసలైన బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే సరికొత్త కాన్సెప్ట్ అంటూ హైప్ గట్టిగానే క్రియేట్ చేశారు. ఇక మొత్తానికి విడుదల రోజు నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. 5రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంది. ఇక 6వ రోజు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
నిజమైన గెలువు
ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక విడుదల అనంతరం నరేష్ నటన సినిమా కాన్సెప్ట్ బావుందని కామన్ ఆడియేన్స్ మౌత్ టాక్ కలెక్షన్స్ పెరగడానికి హెల్ప్ అయ్యింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద నరేష్ కు ఒక నిజమైన గెలువు దక్కిందనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ఈ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.
డీసెంట్ ఓపెనింగ్స్
నరేష్ 2012లో చివరగా సుడిగాడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత 9 ఏళ్లయినా విజయం దక్కలేదు. ఇక ఇన్నాళ్లకు ఒక మంచి విజయం దక్కింది.మొత్తానికి నాంది సినిమాతో నరేష్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న నాంది ఆ తరువాత రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ట్రాక్ లోకి వచ్చేసింది.
6వ రోజు వచ్చిన కలెక్షన్స్
నాంది సినిమా నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు అతికొద్ది దూరంలో ఆగి ఐదవ రోజు అనుకున్న పని పూర్తి చేసుకుంది. ఇక 6వ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతున్నాయి. నాంది 6వ రోజు కలెక్షన్స్(షేర్స్) విషయానికి వస్తే.. నైజాం 8లక్షలు, సీడెడ్ 2లక్షలు, ఉత్తరాంధ్ర 3లక్షలు, ఈస్ట్ 2లక్షలు, వెస్ట్ 1.6లక్షలు, గుంటూరు 1.8లక్షలు, కృష్ణా 1.9లక్షలు, నెల్లూరు 1.1లక్షలు. ఏపీ తెలంగాణలో 6వ రోజు నరేష్ నాంది మొత్తం అందుకున్న షేర్స్ 0.21కోట్లు.
6 రోజుల్లో మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నాంది మూవీ 5రోజుల్లో అనుకున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. సినిమా 2.7కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 3కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక 6రోజుల్లో ఆ టార్గెట్ ను అందుకొని వరల్డ్ వైడ్ గా 3.12కోట్ల షేర్స్ ను అందుకుంది. గ్రాస్ కలెక్షన్స్ 5.50కోట్లు. ప్రస్తుతం సినిమా 0.28కోట్లతో సినిమా ప్రాఫిట్ జోన్ లో కొనసాగుతోంది.