twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామిడీ హీరో అల్లరి నరేష్ అంత చీపా?

    By Srikanya
    |

    అల్లరి నరేష్ తాజాగా వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'చీప్ అండ్ బెస్ట్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్.ఎల్.కుమార్ చౌదరి నిర్మించే ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామిడీతో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎమ్.ఎల్ .కుమార్ చౌదరి,వంశీ కాంబినేషన్ లో గతంలో 'దొంగ రాముడు అండ్ పార్టీ' చిత్రం వచ్చింది. శ్రీకాంత్,లయ కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సారి ఎలాగయినా హిట్టు ఇవ్వాలని వంశీ గత కొద్ది నెలలుగా స్క్రిప్టు పై కూర్చుంటున్నారు. ఇక అల్లరి నరేష్ తాజాగా ఉషాకిరణ్ వారికి 'బెట్టింగ్ బంగార్రాజు' అనే చిత్రం చేస్తున్నారు. ఇ.సత్తిబాబు ఆ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నారు. అనతరం కె.విశ్వనాధ్ దర్శకత్వంలో రెడీ కానున్న 'సుమధురం' చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ లోగా ముళ్లపూడి వీరభద్ర చౌదరి అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ ఎ ఛానెల్ వారు 'ఎమ్మల్యే' అనే చిత్రాన్ని అల్లరి నరేష్ తో చేస్తున్నారు. వీటి మధ్యలో వంశీ తో చేసే ఈ 'చీప్ అండ్ బెస్ట్' చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X