twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ పెళ్ళికి ముందే మ్యాచ్ ఫిక్సింగ్

    By Srikanya
    |

    అల్లరి నరేష్ త్వరలో పెళ్ళి వలలో ఇరుక్కుపోయి గిజ గిజలాడే సుబ్బారావుగా కనిపించనున్నాడు. వీరభద్రచౌదరి దర్శకత్వంలో బిందాస్ నిర్మాతలు అనీల్ సుంకర నిర్మిస్తున్న చిత్రానికి అహనా పెళ్ళంట అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. అలాగే ఈ టైటిల్ కి మ్యాచ్ ఫిక్సింగ్ అనే ట్యాగ్ లైన్ గా పెట్టారు. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కోకాపేటలోని మర్యాదరామన్న హౌస్ లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ని ఈ నెల 22 నుంచి వేరే ప్రాంతంలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం గ్యారెంటీ హిట్ అనే కాన్ఫిడెన్స్ లో నిర్మాతలు ఉన్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా రీతూ అనే హీరోయిన్ పరిచయం అవుతోంది. మరో ప్రక్క ఈ చిత్రం కొరియన్ చిత్రం మారియింగ్ మాఫియా అనే చిత్రం ఫ్రీమేక్ అని అంతటా వినపడుతోంది. ఇక ఈ అహనా పెళ్ళంట టైటిల్ గతంలో రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల సృష్టించిన అధ్బుతమైన కామిడీ కి పెట్టారన్న సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X